మూవీడెస్క్: సంక్రాంతి పండుగకు తెలుగు బాక్సాఫీస్ దద్దరిల్లేందుకు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సిద్ధమవుతున్నాడు.
శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ భారీ అంచనాల నడుమ జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేయగా, కియారా అద్వానీ, అంజలి లీడ్ రోల్స్ పోషించారు.
ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్‌కి మంచి స్పందన రావడంతో సినిమా మీద హైప్ పెరిగింది.
శంకర్ మార్క్ గ్రాండియర్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటుందని ట్రైలర్ స్పష్టం చేసింది.
దీంతో గేమ్ ఛేంజర్ ఓపెనింగ్ వసూళ్లు టాలీవుడ్ హిస్టరీలో కొత్త రికార్డును సృష్టిస్తాయని భావిస్తున్నారు.
ప్రస్తుతం సంక్రాంతి ఓపెనింగ్స్ రికార్డ్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా పేరిట ఉంది.
2020లో విడుదలైన ఆ సినిమా రూ.45.7 కోట్ల ఓపెనింగ్ వసూళ్లు రాబట్టింది.
ఇప్పుడు గేమ్ ఛేంజర్ ఆ రికార్డును బ్రేక్ చేసి, రూ.50 కోట్ల మార్క్ దాటుతుందనే అంచనాలు ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
శంకర్, చరణ్ కాంబినేషన్ మూవీ కావడంతో పాజిటివ్ మౌత్ టాక్ వస్తే, ఈ సంక్రాంతి బాక్సాఫీస్‌ను గేమ్ ఛేంజర్ పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు.