టాలీవుడ్‌లో మరో కొత్త వివాదం చర్చనీయాంశంగా మారింది. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమాలోని పాటలు ఊహించిన స్థాయిలో వైరల్ కాలేదని, హుక్ స్టెప్పుల లోపమే అందుకు కారణమని తమన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
ఈ కామెంట్స్ చరణ్ అభిమానులకు మింగుడు పడలేదు. దీనితో చరణ్ తమన్‌ను సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేశారని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.
ఈ ప్రచారంపై చరణ్ టీమ్ స్పష్టతనిచ్చింది. అసలు చరణ్ ఎప్పుడూ తమన్‌ను ఫాలో కాలేదని, సోషల్ మీడియాలో అతను చాలా తక్కువ మందినే ఫాలో అవుతారని తెలిపారు. ఈ వివరణతో అన్‌ఫాలో వార్తలన్నీ అసత్యమని స్పష్టమైంది. అయితే, తమన్ చేసిన కామెంట్ల కారణంగా అభిమానుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
తమన్ గతంలో గేమ్ ఛేంజర్ పాటలు స్క్రీన్‌పై అద్భుతంగా ఉంటాయని ప్రశంసించగా, ఇప్పుడు అవి హిట్ కాలేదని చెప్పడం వల్ల అభిమానులు అయోమయానికి గురయ్యారు. మరి, ఈ వివాదం ఇక్కడితో ముగుస్తుందా లేక ఇంకో మలుపు తిరుగుతుందా అనేది చూడాలి.