ట్విట్టర్: రామ్ గోపాల్ వర్మ – చాలా సార్లు ఈ పేరు వింటే మనకి ఎందుకురా వీడి ఖర్మ అనిపిస్తుంది, కానీ కొన్ని సార్లు ఆయన మాటల్లో ఉన్నది ధర్మమే కదా అనిపిస్తుంది. ఉదాహరణకి బాలీవుడ్ హీరో మరణానంతరం జరుగుతున్నా పరిణామాలు, వారసత్వం మీద పెరుగుతున్న దూషణల పైన ఆయన ట్వీట్ చూద్దాం
ఒకవేళ సుశాంత్ మరణించకుండా ఉంది ఒక ఇరవై సంవత్సరాలలో తన కొడుకుని సినిమాలకి పరిచయం చేస్తే తనపై కూడా అపుడు అందరూ ఇలాగే మాట్లాడేవారు. సరిగ్గా చెప్పాలంటే అదే నిజం.
అసలు నిజానికి ఈ వారసత్వం అనేది మొదటి రెండు మూడు మహా అయితే ఒక పది సినిమాలకి పనికివస్తుంది కానీ ఆ తరవాత టాలెంట్ లేనిదే ఎక్కడైనా ఎవరైనా వెనక్కి తిరిగి వెళ్లాల్సిందే. నిజం చెప్పాలంటే ఒక వారసత్వం తోకతో వచ్చే తారల్ని నెత్తిన పెట్టుకునేది మనమే, వాళ్ళకి ముందే అభిమాన సంఘాలు మళ్ళీ వాళ్ళ కోసం ఇతర అభిమాన సంఘాల తో కొట్లాటలు. వాళ్ళు బాగానే ఉంటారు వీళ్ళు వీళ్ళు తలలు పగలగొట్టుకుంటారు.
అందుకే ఇలాంటి విషయాల్లో తల పండిన వర్మ గారి ధర్మాన్నే ప్రస్తుతానికి పాటిద్దాం.