తిరుమలకు సొంత డెయిరీ: తిరుమలలో లడ్డూ ప్రసాదం తయారీకి నకిలీ నెయ్యి వాడుతున్న వార్తల నేపథ్యంలో, బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. లేఖలో తితిదేకు సొంత డెయిరీ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.
రోజుకు లక్ష మంది భక్తులు దర్శనం చేసుకునే తిరుమలలో డెయిరీ ఏర్పాటు చేయడం వల్ల కల్తీ నెయ్యి సమస్యను పరిష్కరించవచ్చని అభిప్రాయపడ్డారు.
రామచంద్ర యాదవ్ తన తరఫున వేయి గోవులను అందించేందుకు సిద్ధంగా ఉన్నానని, మరొక లక్ష గోవులను ఉచితంగా సమకూర్చగల సన్నాహాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ గోవుల నుండి రోజుకు 10 లక్షల లీటర్ల ఆవుపాలు ఉత్పత్తి చేసి, 50 వేల కేజీల వెన్న, 30 వేల కేజీల నెయ్యి తయారు చేయవచ్చని తెలిపారు.