fbpx
Tuesday, May 13, 2025
HomeMovie NewsRRR - 'రామరాజు ఫర్ భీం' వీడియో విడుదల

RRR – ‘రామరాజు ఫర్ భీం’ వీడియో విడుదల

RamarajuForBheem TeaserFrom RRRMovie

టాలీవుడ్: టాలీవుడ్ కేజ్రీ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌలి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న సినిమా RRR . ఈ సినిమాని రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమానుండి ‘భీం ఫర్ రామరాజు’ అని రామ్ చరణ్ ఇంట్రో వీడియో ఒకటి ఇదివరకే విడుదల చేసారు. ఇపుడు ఎన్టీఆర్ కి సంబందించిన ‘రామరాజు ఫర్ భీం’ వీడియో ని ఇవాళ కొమరం భీం పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసారు. ఒక నిమిషం 32 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో ఆద్యంతం ఆకట్టుకుంది.

రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో ‘రామరాజు ఫర్ భీం’ వీడియో ఉంటుంది. వీడియో లో ఉన్న ఒక్కో షాట్ అభిమానులని కట్టిపడేస్తుంది. ఈ టీజర్ మాత్రం విజువల్ గా చాలా ఆకట్టుకుందని చెప్పవచ్చు. ‘వాడి పొగరు ఎగిరే జెండా’ లాంటి సాయి మాధవ్ బుర్రా మాటలు కూడా అద్భుతం. ఈ సినిమాకి సంబందించిన టీజర్స్ చూసిన తర్వాత ఎలేవేషన్స్ ఇవ్వాలంటే రాజమౌళి తర్వాతే ఎవరైనా అని చెప్పవచ్చు. ఇంకా టెక్నీషియన్స్ విషయానికి వస్తే ఈ విజువల్ చూసిన తర్వాత సినిమాటోగ్రాఫర్ సెంథిల్ ని అభినందించకుండా ఉండలేం. బాగ్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఎం ఎం కీరవాణి మరోసారి తన సత్తా చాటుకున్నాడు.

సినిమా లోగో విడుదల చేసినప్పటినుండి రామ్ చరణ్ ని ఫైర్ థీమ్ తో, ఎన్టీఆర్ ని వాటర్ థీమ్ తో చూపిస్తున్నాడు రాజమౌళి. రామ్ చరణ్ ఇంట్రో వీడియో లో మొత్తం ఫైర్ బాగ్ గ్రౌండ్, ఒరగనే షేడ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఎన్టీఆర్ టీజర్ చూస్తే మొత్తం వాటర్ బాగ్ గ్రౌండ్, బ్లూ షేడ్స్ ఎక్కువ కనిపిస్తాయి. డిటైలింగ్ కూడా ఎక్కడ మిస్ అవకుండా టీజర్ లో ప్రతీ షాట్ సినీ అభిమానుల్ని ఆకట్టుకుందని చెప్పవచ్చు.

Ramaraju For Bheem - Bheem Intro - RRR (Telugu) | NTR, Ram Charan, Ajay Devgn, Alia | SS Rajamouli

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular