టాలీవుడ్: ఈ సంవత్సరం ఆరంభం లో క్రాక్ సినిమా ద్వారా కరోనా తర్వాత మొదటి బ్లాక్ బస్టర్ సాధించి జోష్ లో ఉన్న హీరో రవి తేజ. తర్వాత ఖిలాడీ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నటించాడు. ఈ సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది. వెంటనే శరత్ మండువా అనే కొత్త దర్శకుడితో తన 68 వ సినిమాకి శ్రీకారం చుట్టాడు. ఈ మధ్యనే షూటింగ్ మొదలు పెట్టిన ఈ సినిమా షూటింగ్ పరంగా , అప్ డేట్స్ పరంగా శర వేగంగా దూసుకెళ్తుంది. ఈ రోజు ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ తో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేసారు సినిమా టీం.
‘రామ రావు ఆన్ డ్యూటీ’ అనే టైటిల్ తో ఈ సినిమా రూపొందనుంది. సినిమా ఫస్ట్ లుక్ లో కూల్ గా ఇన్ షర్ట్ వేసుకుని గాగుల్స్ పెట్టుకున్న లుక్ లో రవి తేజ ని చూపించారు. బ్యాక్ గ్రౌండ్ లో ఒక గవర్నమెంట్ వెహికిల్ మరియు గవర్నమెంట్ ఎంప్లాయ్ జాబ్ లో జాయిన్ అయ్యేప్పుడు రాసే ఒక లెటర్ చూపించారు. ఈ సినిమాలో మెజిస్ట్రేట్ కార్యాలయం లో పని చేసే ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ గా రవితేజ నటించనున్నారు. అంతేకాకుండా తన ముందు అన్యాయం జరిగితే సహించని పాత్ర అని పోస్టర్స్ చూస్తే తెలుస్తుంది.
మజిలీ లో నటించిన దివ్యాన్శ కౌశిక్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో రవి తేజ ప్రొడ్యూసర్ గా కూడా మారాడు. ఎస్ఎల్వీ సినిమాస్ మరియు RT టీం వర్క్స్ బ్యానర్స్ పై సుధాకర్ చెరుకూరి మరియు రవి తేజ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సామ్ సి.ఎస్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఒక పీరియాడిక్ కథనం తో రూపొందుతున్న ఈ సినిమాని ఈ సంవత్సరం చివరికల్లా విడుదల చేయాలనీ మేకర్స్ భావిస్తున్నారు.