
టాలీవుడ్: రాజమౌళి కన్నా ముందు సౌత్ నుండి ఎవరి సినిమాలైనా ఇండియా మొత్తం తెలిసేలా చేశాయి అంటే డైరెక్టర్ శంకర్ పేరు ఒక్కటే వినిపిస్తుంది. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అని బడ్జెట్ లు అని రక రకాల కాల్క్యూలేషన్స్ తో సినిమాలు రూపొందిస్తున్నారు కానీ ఇవేవి లేనప్పుడే 10 – 15 కోట్లు హై బడ్జెట్ అని చెప్పి సినిమాలు రూపొందించే సమయంలోనే ఒక్క పాటకి కోటి రూపాయలు బడ్జెట్ కేటాయించి సినిమాలు తీసి హిట్ సాధించిన డైరెక్టర్ శంకర్. ప్రేమికుడు, జీన్స్, భారతీయుడు, జెంటిల్మెన్, ఒకే ఒక్కడు, రోబో, రోబో 2 ఈ సినిమాలు చాలు శంకర్ గొప్పతనం తెలియ చెప్పడానికి. ప్రస్తుతం శంకర్ కమల్ హాసన్ తో భారతీయుడు 2 ని రూపొందిస్తున్నారు. దీని తర్వాత ఈ డైరెక్టర్ టాలీవుడ్ టాప్ హీరో రామ్ చరణ్ తో సినిమా తీయనున్నారు.
RRR షూటింగ్ క్లోసింగ్ లో బిజీ గా ఉన్న రామ్ చరణ్ తన తదుపరి సినిమాని ప్రకటించి ఆశ్చర్యపరిచాడు. ఇప్పటివరకు డైరెక్ట్ తెలుగు హీరో తో సినిమా రూపొందించని క్రేజీ డైరెక్టర్ శంకర్ తో తన తరువాతి సినిమాని ప్రకటించాడు. ఈ సినిమాని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దిల్ రాజు బ్యానర్ లో 50 వ సినిమాగా ఈ సినిమా రూపొందుతుంది. దిల్ రాజు కూడా ప్రెస్టీజియస్ గా తీసుకుని ఈ సినిమాని రూపొందిస్తున్నారు. దిల్ రాజు శంకర్ తో ఇదివరకే భారతీయుడు సినిమాని ప్రకటించాడు కానీ ఎందుకో చివరి నిమిషంలో ఆ సినిమానుండి తప్పుకున్నాడు. బహుశా ఈ సినిమా కోసమే అప్పుడు ఆ సినిమా వొదులుకున్నాడేమో.