fbpx
Sunday, January 19, 2025
HomeMovie Newsఆచార్య: సిద్దా గా చరణ్ ఫస్ట్ లుక్

ఆచార్య: సిద్దా గా చరణ్ ఫస్ట్ లుక్

RamCharanTej AsSidhaFirstLookFrom Acharya

టాలీవుడ్: టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ‘ఆచార్య’ అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ రోజు రామ్ చరణ్ తేజ్ పుట్టినా రోజు సందర్భంగా ఈ సినిమా నుండి రామ్ చరణ్ లుక్ ని విడుదల చేసి సర్ప్రైస్ చేసింది సినిమా టీం. ఈ సినిమాలో దాదాపు ముప్పై నిమిషాల నిడివి ఉన్న ఒక ముఖ్యమైన పాత్రలో రామ్ చరణ్ నటించనున్నట్లు టీం తెలిపింది. ఈ పోస్టర్ లో నక్సలైట్ గెట్ అప్ లో చిరు మరియు చరణ్ ఇద్దరూ గన్ పట్టుకుని కలిసి నడుస్తూ రావడం కనిపిస్తుంది.

తండ్రి కొడుకులు నటిస్తున్న ఈ సినిమా పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్ లో ‘బ్రూస్ లీ ‘ సినిమాలో కొన్ని సీన్లు ఉన్నప్పటికీ ఫుల్ లెంగ్త్ పాత్రతో వీళ్లిద్దరు ఇదే మొదటి సారి కలిసి పని చేస్తున్నారు. సైరా తర్వాత చిరంజీవి ఈ సినిమా తోనే మన ముందుకు రానున్నాడు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సమర్పణలో, మాటినీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. మణి శర్మ ఈ సినిమాతో చాలా కాలం తర్వాత చిరుతో పని చేయనున్నాడు. ఈ సినిమాని మే లో విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular