టాలీవుడ్: లాక్ డౌన్, కరోనా టైం లో కూడా వరుస పెట్టి సినిమాలు తీసి ఎవరూ సినిమాలు విడుదల చేయడానికి దైర్యం చేయని సమయం లో కొన్ని సినిమాలు తీసి ఓటీటీల్లో పే పర్ వ్యూ పద్దతిలో విడుదల చేసాడు రామ్ గోపాల్ వర్మ. అయితే కరోనా నేపథ్యంలోనే ‘కరోనా’ అనే ఒక సినిమా తీసాడు రామ్ గోపాల్ వర్మ. రియల్ లైఫ్ హర్రర్ సినిమా ఇది అని ప్రచారం చేస్తూ డిసెంబర్ 11 న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించాడు. లాక్ డౌన్ తర్వాత విడుదల అవుతున్న మొదటి సినిమా అని పోస్టర్ లో తెలిపారు. అంటే ఈ సినిమా థియేటర్ లోనే విడుదల అవుతుంది అని చెప్పకనే చెప్పారు.
ఇపుడిపుడే మెల్లి మెల్లిగా థియేటర్లు తెరచుకుంటుండడం తో సినిమాలు కూడా విడుదల అవడానికి సిద్ధం అవుతున్నాయి. కరోనా నేపధ్యం లోనే ఒక ఇంట్లో జరిగే సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందించారు వర్మ. మన ఇంట్లోని వ్యక్తికి , మన కుటుంబ సభ్యునికి కరోనా వస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఈ సినిమా ద్వారా చూపించే ప్రయత్నం చేసారు. కరోనా గురించి జనాలు చాలా భయపడుతున్న సమయంలో మానవత్వం ఏ స్థాయికి దిగజారిందో వార్తల్లో చూసాం. ఈ సినిమా ద్వారా ఆ అంశాలన్ని ఎక్కువగా ప్రయత్నించినట్టు ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. రామ్ గోపాల్ వర్మ మరియు అన్నపురెడ్డి ఎల్లా రెడ్డి నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాని అగస్త్య మంజు దర్శకత్వం వహించారు.