బాలీవుడ్: అండర్ వరల్డ్ సినిమాలకి పెట్టింది పేరైన ఆర్జీవీ చాలా రోజుల తర్వాత తన డ్రీం ప్రాజెక్ట్ అని ఒక అండర్ వరల్డ్ సిరీస్ తో రాబోతున్నాడు. దావూద్ ఇబ్రహీం కథతో ‘D కంపెనీ’ అనే సిరీస్ చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సిరీస్ కి సంబందించిన టీజర్ విడుదల చేసారు. ముంబై మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం డాన్ గా ఎలా ఎదిగాడు అనే క్రమం ఇందులో చూపించబోతున్నాడు. 1980 లో ముంబై మహా నగరం లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ కథని రూపొందించాడు. దాదాపు మూడు నిమిషాలున్న ఈ టీజర్ లో దావూద్ ఇబ్రహీం డాన్ గా ఎలా ఎదిగాడు అని చూపించినట్టు అర్ధం అవుతుంది.
ఒక చిన్న గ్యాంగ్ లో జాయిన్ అయ్యే స్టేజ్ నుండి ఒక కంపెనీ పెట్టె స్టేజ్ వరకు దావూద్ ప్రయాణం టీజర్ ద్వారా అర్ధం అవుతుంది. గ్యాంగ్ ఫార్మ్ చెయ్యడం, వార్నింగ్ లు ఇవ్వడం, గన్స్ సప్లై చెయ్యడం, బ్లాస్ట్స్ చెయ్యడం, బాలీవుడ్ హీరోయిన్స్ ని బెదిరించడం, వాడుకోవడం లాంటి చాలా అంశాలని టచ్ చేసినట్టు టీజర్ లో తెలుస్తుంది. ఈ సినిమాని మహాభారతం తో పోలుస్తూ ‘మహా భారత్ అఫ్ అండర్ వరల్డ్’ అనే టాగ్ కూడా జత చేసారు వర్మ. స్పార్క్ ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై స్పార్క్ సాగర్ ఈ సిరీస్ ని నిర్మిస్తున్నాడు. ఐదు భాషల్లో ఈ సిరీస్ కొద్దీ రోజుల్లో విడుదల అవ్వనుంది.