
హైదరాబాద్: మాఫియా సినిమాలు, హారర్ సినిమాలు కుప్పలు కుప్పలుగా తీసిన రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం నిజ జీవిత కథలని బయోపిక్ లుగా, వాస్తవ సంఘటనలు కొన్ని తీసుకొని వాటిని సినిమాలుగా తియ్యడం మొదలు పెట్టాడు. అందులో భాగంగానే పోయిన సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన ‘దిశ’ అత్యాచారం మూల కథగా తీసుకొని సినిమా తీస్తున్నాడు. ఆ సినిమాకి సంబందించిన ట్రైలర్ ని ఇవాళ విడుదల చేసాడు. ఆరోజు జరిగిన సంఘటనలతో ఉన్నది ఉన్నట్టుగా కళ్ళకి కట్టినట్టు చూపించినట్టు ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది.
దిశ అసలు నేరగాళ్ల ట్రాప్ లో ఎలా ఇరుక్కుంది, వాళ్ళు దిశాని కిడ్నాప్ ఎలా చేయరు, చివరకి ఎలా చంపారు లాంటి సంఘటనలు ట్రైలర్ లో ప్రెసెంట్ చేసారు. అయితే వర్మ ఇంతకముందు అందులోనే నేరగాళ్ల సైడ్ నుండి కూడా కొంచెం కథ చూపిస్తానని, అందులో ఒక నేరస్తుడి లవ్ స్టోరీ కూడా ఉంటుంది అని ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు. 26 నవంబర్ 2019న నలుగురు అగంతకుల హత్యాచారానికి సంబంధించిన ఈ సినిమాని సరిగ్గా సంవత్సరం తర్వాత అదే రోజున విడుదల చేస్తానని వర్మ ఇదివరకే ప్రకటించారు. ఆనంద్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా ఆర్జీవీ ప్రచార సారథిగా.. నట్టి క్రాంతి & నట్టి కరుణ నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ అయ్యంగార్- సోనియా అకులా- ప్రవీణ్ రాజ్ తదితరులు నటించారు. D. S. R. సంగీతం అందించారు. జగదీష్ చెకాటి- కళ్యాణ్ సామి ఛాయాగ్రహణం అందించారు.