టాలీవుడ్: ఎపుడూ ఎదో ఒక కొత్త సినిమాతోనో, తన వివాదాస్పద మాటలతోనే లైం లైట్ లో ఉండే వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. దాదాపు కొన్ని సంవత్సరాలుగా నిజ జీవిత సంఘటనలు, నిజ జీవిత కథలు, వివాదాలతో ముడిపడి ఉన్న కథలని ఎంచుకుంటూ వాటితో సినిమాలు తీస్తూ వార్తల్లో నిలుస్తూ ఎంతో కొంత పబ్లిసిటీ ఏర్పరచుకుని వాటితో సినిమాల్ని నడిపిస్తున్నాడు. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లాంటి వారిని టచ్ చేసిన ఆర్జీవీ ఇప్పుడు పక్క రాష్ట్రం తమిళనాడు రాజకీయాలపైన పడ్డాడు. తమిళ రాజకీయాల్లో ‘జయ లలిత ‘ పాత్ర క్రియాశీలం. ఆవిడ చనిపోయిన తర్వాత చాలా సంఘటనలు జరిగాయి. అందులో ముఖ్య పాత్ర పోషించిన ‘శశికళ’ కథ ఆధారంగా ఈ సినిమాని ప్రకటించాడు.
ఈ సినిమాలో ముఖ్యంగా తమిళనాడు రాజకీయాలని అలాగే జయ లలిత, శశి కల, పన్నీర్ సెల్వం మధ్య ఉండే కథని సినిమాగా తియ్యబోతున్నట్టు ప్రకటించాడు. తమిళనాడు రాజకీయాల్లో ఒక లేడీ ‘S ‘ మరియు ఒక ‘E ‘ ఒక లీడర్ కి ఏం చేసారు అనేది చూపించబోతున్న అని చెప్పాడు. ఇక్కడ S అంటే శశికళ అని E అంటే పన్నీర్ సెల్వం అని లీడర్ అంటే జయలలిత అని చెప్పకనే చెప్పాడు. ఒకర్ని చంపాలంటే ఆ వ్యక్తికి క్లోజ్ అయి ఉంటె ఈజీ గా చెయ్యగలం అనే ఒక కొటేషన్ ని కూడా ఒక పాత తమిళ్ పదం అని జత చేసాడు ఆర్జీవీ.లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని నిర్మించిన రాకేష్ రెడ్డి అనే నిర్మాత నిర్మించనున్నాడు. తమిళనాడు ఎలక్షన్స్ కన్నా ముందే ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్టు కూడా ప్రకటించాడు.