టాలీవుడ్: కరోనా కారణంగా అందరూ సినిమాలకి బ్రేక్ ని ఇస్తే రామ్ గోపాల్ వర్మ మాత్రం సినిమాల మీద సినిమాలని వదిలాడు. వరుసగా ప్లాప్ సినిమాలని రూపొందిస్తున్నా కూడా నిర్మాతలు మాత్రం రామ్ గోపాల్ వర్మ ని వదలడం లేదు. ప్రస్తుతం దాదాపు 10 సంఖ్యలో రామ్ గోపాల్ వర్మ సినిమాలు విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. వాటితో పాటు కొత్త సినిమాలని ప్రకటించడం, ఫస్ట్ లుక్ లు రిలీజ్ చేస్తుంటాడు. అవన్నీ సినిమాగా రూపాంతరం అవ్వవు కానీ కొన్ని సినిమాగా రూపొందించి విడుదల చేస్తుంటాడు. ప్రస్తుతం దావూద్ ఇబ్రహీం కథతో రూపొందిన ‘ D కంపెనీ ‘ అనే సినిమా స్పార్క్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో రూపొందించి వారి ఓటీటీ లోనే విడుదల చేస్తున్నారు.
స్పార్క్ ఎంటర్టైన్మెంట్స్ వారి నిర్మాణంలోనే ‘TABLET ‘ అనే మరో సినిమా ప్రకటించి ఫస్ట్ లుక్ ఒకటి విడుదల చేసాడు వర్మ. కానీ ఈ సినిమాకి వర్మ దర్శకత్వం , నిర్మాణం చేయడం లేదు. ఈ సినిమాని ప్రకటిస్తూ ఈ విధం గా ట్వీట్ చేసారు. ‘అందరూ ముసలి వాళ్ళు అవడానికి, చావడానికి భయపడతారు, ఈ సినిమా ముసలి తనం రాకుండా, చావుని ఆపేలా చేసే ఒక మెడిసిన్ గురించి. ఈ టాబ్లెట్ అందరికి కావాలి కానీ ఆ తర్వాత అదే పెద్ద శాపం అవుతుంది’ అని తనదైన స్టైల్ లో చెప్పారు. స్పార్క్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సాగర్ మచ్చనూరు ఈ సినిమాని నిర్మించనున్నారు. ఆర్.కమల్ అనే దర్శకుడు ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్నాడు.