టాలీవుడ్: ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, హీరోస్ ఇలా ఇండస్ట్రీ లో 24 క్రాఫ్ట్స్ లో పని చేస్తున్న వారు షూటింగ్స్ మొదలుపెట్టాలా లేదా అన్న విషయంలో తలలు బాదుకుంటుంటే రామ్ గోపాల్ వర్మ మాత్రం సినిమాల మీద సినిమాలు తీసి వదులుతున్నాడు. తీసిన సినిమాలు కూడా ఎలా విడుదల చెయ్యాలో అర్ధం కాకుండా కొందరు ఉంటె ఒక్క కొత్త ATT ని ప్రారంభించి అందులో సినిమాలు విడుదల చేస్తున్నాడు వర్మ. ఒక రకంగా కొత్త దారి చూపిస్తున్నట్టే ఉంది కానీ ఆయన తీసే సినిమాలే క్వాలిటీ విషయంలో, విలువల విషయంలో అట్టడుగు స్థానానికి పోటీ పడుతున్నాయి.
వర్మ కి మొదటి నుండి మాఫియా, హర్రర్, థ్రిల్లర్ సినిమాలే బాగా కలిసొచ్చాయి. ఒకప్పుడు బాలీవుడ్ లో వరుసగా చాలా హర్రర్, థ్రిల్లర్ జానర్ సినిమాలు తీసాడు వర్మ. ఈ మధ్య ఎక్కువగా కాంట్రవర్సీస్ మీద పబ్బం గడుపుతున్న వర్మ మల్లి థ్రిల్లర్ జానర్ పైన ‘థ్రిల్లర్’ అనే టైటిల్ తోనే సినిమా తీసాడు. ఈరోజు ఈ సినిమా తాలూకు ట్రైలర్ విడుదల చేసాడు. ట్రైలర్ లో చెప్పుకోదగ్గ విశేషాలు ఏమి లేకపోయినా కూడా మొదటి నుండి మంచి టెక్నీషియన్ అని పేరున్న వర్మ ఆ పేరుని కూడా చెడగొట్టుకునే పని లో ఉన్నాడు. ఈ సినిమాలో ఉన్న కెమెరా యాంగిల్స్ చూస్తే మాత్రం చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. హీరోయిన్ అందాల్ని ప్రదర్శిండానికి తప్ప వేరే ఏ విధంగా సినిమా ఉంటుందో అని ఎలాంటి అంచనాలు లేకుండా కట్ చేసారు ట్రైలర్. ట్రైలర్ లోనే ఏమీ లేదంటే ఇంకా సినిమాలో ఏముంటుందో ముందు ముందు తెలియాలి. ఐస్ క్రీం లాంటి సినిమాకే 2 – 3 పార్ట్స్ తీసిన వర్మ ఈ సినిమాకి కూడా పార్ట్స్ తీసినా తియ్యొచ్చు. ఇప్పుడు వర్మ తీసే సినిమాలు అయితే బూతు సినిమాలు లేదంటే బూతులు తిట్టించుకునే సినిమాలు అన్నట్టు ఉంది వరుస.
Maro b grade cinema ostundi anamata.