టాలీవుడ్: శివ సినిమాతో రామ్ గోపాల్ వర్మ సినిమా ప్రయాణం ప్రారంభమైంది. మొదటి సినిమా తోనే సూపర్ హిట్ కొట్టి సినిమా మేకింగ్ లో కొత్త ఒరవడి సృష్టించి ట్రెండ్ సెట్టర్ అయ్యాడు. ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కూడా మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా కొన్ని సంవత్సరాలు సినిమాలు తీసాడు. అయితే చివరకి హర్రర్ సినిమాలు, అండర్ వరల్డ్ డాన్ సినిమాలు ఎక్కువ చేస్తూ ఆ జానర్ వరకే పరిమితం అయ్యాడు. ఇపుడు నిజ జీవిత కథలు, వివాదాలకు సంబందించిన కథలు, బయోపిక్ లు చేస్తూ ఉన్నాడు. అండర్ వరల్డ్ డాన్ సినిమాల్లో గాయం, సత్య లాంటి సినిమాలు వర్మ కి ఎక్కువ పేరు తెచ్చి పెట్టాయి.
చాలా రోజుల తర్వాత వర్మ మరో సారి అండర్ వరల్డ్ డాన్ కథ తో సినిమా తీస్తున్నాడు. అయితే ఈ సారి ఈ సినిమా తన డ్రీం ప్రాజెక్ట్ అని ఇదివరకే మెన్షన్ చేసాడు. ఇపుడు ఆ సినిమాకి కార్య రూపం దాల్చుతున్నాడు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కథతో తీస్తున్నట్టు ట్వీట్ చేసాడు. దీనికి సంబందించిన ఫస్ట్ లుక్ ని 15 వ తేదీన విడుదల చేయబోతున్నట్టు ప్రకటించాడు .దావూద్ ఇబ్రహీం ప్రపంచం లోనే భయంకరమైన ఆర్గనైజషన్ గా ఎలా ఎదిగాడో చెప్పే ప్రయత్నం అని వర్మ పేర్కొన్నాడు. ఇది వెబ్ సిరీస్ లేదా సినేమానా అనే విషయం అనేది స్పష్టంగా అయితే ఎక్కడా తెలుపలేదు. కానీ ఈ కథని స్పార్క్ కంపెనీ బ్యానర్ పై స్పార్క్ సాగర్ నిర్మిస్తున్నారు.