టాలీవుడ్ : వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్న వర్మ అనుకున్నట్టుగానే మరో వివాస్పదమైన సినిమా తియ్యడానికి రెడీ అయ్యాడు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ ‘అల్లు’ అనే సినిమాను తియ్యనున్నట్టు ప్రకటించాడు. ప్రకటించడమే కాకుండా ఆ సినిమాలోని పాత్రలని, ముఖ్య పాత్ర స్వభావాన్ని తన ట్వీట్ల ద్వారా తెలియచేసాడు. ఇక ఎప్పటిలాగే ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ అని తన మార్గం లో చెప్పాడు.
వర్మ తాను తీయబోయే ఈ ‘అల్లు’ సినిమా గురించి వరుసగా ట్వీట్లు చేసాడు.
ఈ సినిమా ఒక పెద్ద హీరో కుటుంబానికి ఆయన బావమరిది ఏం చేసాడు అనే దాని పైన ఉంటుందని చెప్పాడు వర్మ. అలాగే ఆ హీరో ‘జన రాజ్యం’ పార్టీ ని ప్రకటించిన తర్వాతి కథ అని కూడా చెప్పారు. ఈ సినిమాకి “అల్లు” అనే టైటిల్ ఎందుకు పెట్టామంటే ఇందులోని మెయిన్ క్యారెక్టర్ రకరకాల ప్లాన్స్ “అల్లు”తూ వుంటాడు. తనకి మంచి జరగాలి అంటే ప్లాన్ అల్లు, మరొకడికి చెడు జరగాలి అంటే ప్లాన్ అల్లు అనే స్ట్రాటర్జీ తో ప్లాన్ ల అల్లుడు లో ఆరితేరిపోయి, పెద్ద స్టార్ అయిన తన బావ పక్కనే ఉంటూ తన మైలేజీ పడిపోకుండా ఉండటానికి తమ ఇంటి “అల్లు”డు అని కూడా మర్చిపోయి ఎప్పటికప్పుడు ప్లాన్లు అల్లుతూ వుంటాడు. అందరితో తనని “ఆహా” అనిపించుకోవటానికి తనకి కావాల్సిన వాళ్ళకే మంచి జరిగేలా చెప్పి ప్లాన్ ల మీద ప్లాన్ అల్లుకుపోతూ ఉండే ఒక పెద్ద అల్లికల మాస్టర్ కథే ఈ “అల్లు”. అలాగే ఈ సినిమా లో ఉండే పాత్రల గురించి కూడా ఒక ట్వీట్ చేసాడు. అలాగే ఈ సినిమాలో థియేటర్ మాఫియా, పొలిటికల్ పార్టీ టికెట్స్ గురించి ఉంటుంది ఉండదు అని తనదైన పద్దతిలో తికమకగా చెప్పాడు.
ప్రస్తుతం వర్మ ‘మర్డర్’, ‘థ్రిల్లర్’,’కరోనా‘ సినిమాలు చేస్తున్నాడు. ఇవి విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. ఇలా వరుసగా సినిమాలు చేస్తున్న వర్మ తనపై డబ్బుల కోసం సినిమాలు తీస్తున్నాడు అని వచ్చిన కామెంట్స్ పై ‘మిగతా ప్రొడ్యూసర్స్ అందరూ చారిటీ కోసం ఏమైనా చేస్తున్నారా’ అని ట్వీట్ చేసారు.
prati okka mega actor ki oka parody actor ni pettalani mem korukuntunnam.