ట్విట్టర్: ప్రేక్షకులకి ఒక సినిమా గురించి చేసే మొదటి పరిచయాన్ని ఫస్ట్ లుక్ అంటారు, కానీ రామ్ గోపాల్ వర్మ దాని అర్ధం మార్చేట్లు ఉన్నారు. ఫస్ట్ లుక్ కాకుండా అదొక విప్లవం లా ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేస్తున్నారు. తాను తీస్తున్న పవర్ స్టార్ అనే సినిమా తాలూకు పిక్చర్స్ వరసపెట్టి విడుదల చేస్తున్నారు. ఇందులో నటిస్తున్న ఒక టిక్ టాక్ స్టార్ ఈ సినిమా నుండి వైదొలిగాడు అనే వార్త కనుమరుగు అవ్వకముందే రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా ఫస్ట్ లుక్స్ తో చెలరేగిపోయి తనని ఎవ్వరూ ఆపలేరు అనే మెసేజ్ ఇచ్చారు.
ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో త్వరలోనే ‘పవర్ స్టార్’ సినిమా రిలీజ్ కానుందని ‘జై పవర్ స్టార్‘ అని ట్వీట్ చేసారు. ‘పవర్ స్టార్’ సినిమా టైటిల్ లోగోలో పవన్ కళ్యాణ్ స్థాపించిన ‘జనసేన‘ పార్టీ ఎలక్షన్ సింబల్ అయిన ‘గ్లాస్’ ని పెట్టాడు. అంతేకాకుండా ఇది ‘ఎన్నికల ఫలితాల తర్వాత కథ’ అని ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసాడు. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని పోలి ఉన్న ఆర్టిస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో రిలీజ్ చేసాడు. ”పవర్ స్టార్ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న యాక్టర్ నేను చూసిన స్టార్స్ అందరి కంటే ఎక్కువ పవర్ ఫుల్” అని చెప్పుకొచ్చాడు.
అంతేకాకుండా ”ఇండియన్ శారీలో ఉన్న ఒక రష్యన్ మహిళతో పాపిల్లాన్ అనే ఫ్రెంచ్ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు అర్జెంటియన్ లెజెండ్ చే గువేరా ఫోటో గోడపై వేలాడదీసి ఉంది.. ఈ చిత్రంలోని లీడ్ రోల్ నిజంగా గ్లోబల్ పవర్ స్టార్” అని మరో ట్వీట్ చేసి మెయిన్ లీడ్ ప్లే చేస్తున్న నటుడికి ఎదురుగా ఓ లేడీ నిలబడి ఉన్న ఫోటో షేర్ చేసారు. తనకి వ్యవసాయం చేసేవాళ్ళు అంటే ఇష్టం అని, జంతువులని ప్రేమించే వాళ్ళు ఇష్టం అని ఇంకొన్ని ఫొటోస్ షేర్ చేశారు. ఈ సినిమాలో నటిస్తున్న లీడ్ రోల్, అతన్ని ఒక సన్నివేశం లో డైరెక్ట్ చేస్తున్న డైరెక్టర్ ఫోటో కూడా ఒకటి షేర్ చేసారు. ఇలా రకరకాల కాంబినేషన్స్ లో ఫోటోషూట్ చేసి ఫస్ట్ లుక్స్ విడుదల చేసారు. అంతేకాకుండా ఈ ఫొటోల్లో ఏవైనా పోలికలు ఉంటే అది యాదృచ్చికం మాత్రమే” అని పేర్కొన్నారు. కంటెంట్ ని కాకుండా కాంట్రోవర్సిస్ ని నమ్ముకుని తీస్తున్న RGV సినిమాల ప్రవాహం ఇప్పట్లో ఆగేట్లు లేదు.
Awesome looks. however you are we love you PSPK.
Jai PSPK.
from wgl PSPK yuvasena.