టాలీవుడ్: ‘రెడ్’ సినిమా ద్వారా సంక్రాంతికి తెలుగు అభిమానుల్ని పలకరించిన రామ్ పోతినేని దగ్గరినుండి ఇన్ని రోజులుగా తదుపరి సినిమా ప్రకటన రాలేదు. ఈరోజు తన నెక్స్ట్ సినిమా గురించి అప్ డేట్ ఇచ్చారు. తన నెక్స్ట్ సినిమా ఒక తమిళ దర్శకుడితో చేయనున్నాడు రామ్. పందెం కోడి, రన్, వెట్టై (తెలుగులో తడాఖా), పందెంకోడి 2 , సికందర్ లాంటి సినిమాలని రూపొందించిన లింగుస్వామి ప్రస్తుతం రామ్ తో జతకట్టనున్నారు. రామ్ 19 వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాని బహుభాషా సినిమాగా రూపొందిస్తున్నారు.
పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలోని మిగతా టెక్నిషియన్స్ వివరాలు తెలియాల్సి ఉంది. ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన సక్సెస్ తో జోష్ లో ఉన్న రామ్ ‘రెడ్’ సినిమా అంతగా ఆడకపోవడం తో మరోసారి ఈ సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు.