టాలీవుడ్: సినిమా వాళ్లకి అంటే ప్రొడ్యూసర్స్ మాత్రమే కాదు ప్రేక్షకులకి కూడా సంక్రాంతి సీజన్ అంటే బాగా కలిసొచ్చే టైం. ఎన్ని సినిమాలు విడుదలైనా కూడా సినిమా కొంచెం బాగుందని టాక్ వచ్చినా, విడుదలైన ప్రతీ సినిమా ఆడుతుంది మంచి కలెక్షన్స్ వస్తాయి అని ప్రతి సంవత్సరం రుజువు అవుతూనే ఉంది. అందుకే సంక్రాంతి టైం లో విడుదల చేయడానికి చాలా సినిమాలు పోటీ పడుతూ ఉంటాయి. ఈ సరికి ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరచుకోనుండడం తో ఇంకా పూర్తి లిస్ట్ అయితే బయటకు రాలేదు. కానీ కొన్ని సినిమాలు ఇపుడిపుడే రిలీజ్ డేట్ ని లాక్ చేస్తున్నాయి. నిన్ననే రవి తేజ క్రాక్ సినిమా సంక్రాంతి విడుదల అని ప్రకటించింది. తమిళ్ మూవీ ‘మాస్టర్’ కూడా సంక్రాతి కి విడుదల అవనుంది. ఇపుడు ఈ రేస్ లోకి మరో సినిమా కూడా వచ్చి చేరింది.
చాక్లెట్ బాయ్ రామ్ తో ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ లాంటి సినిమాలని రూపొందించిన ‘కిశోరె తిరుమల‘ దర్శకత్వం లో రామ్ తో ఫుల్ లెంగ్త్ మాస్ రోల్ తో ఒక సినిమా తీసాడు. ‘రెడ్ ‘ అనే టైటిల్ తో రూపొందిన ఈ సినిమా మార్చ్ లో విడుదల అవ్వాల్సింది. కరోనా కారణంగా ఇన్ని రోజులు ఆగిన కూడా ప్రొడ్యూసర్స్ థియేటర్ లోనే విడుదల చెయ్యడానికి ఎదురు చూసారు. ఎట్టకేలకి సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాలో రామ్ డబల్ రోల్ లో నటించనున్నాడు. ఈ సినిమాలో రామ్ కి జోడీ గా మాళవిక శర్మ మరియు అమ్రిత అయ్యర్ నటించారు.ఈ సినిమా ట్రైలర్ ని డిసెంబర్ 24 న విడుదల చెయ్యనున్నారు.