టాలీవుడ్: చాక్లెట్ బాయ్ రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ సినిమా తో తన అవతారం మొత్తం మార్చేసి పూర్తి మాస్ రోల్ లో కనిపించాడు. తాను ముందెప్పుడూ చెయ్యని ఒక ప్రయత్నాన్ని, లుక్ ని ఈ సినిమా ద్వారా చూపించాడు. ఇపుడు మరోసారి ఇంకో మాస్ రోల్ లో రాబోతున్నాడు. ప్రస్తుతం ‘రెడ్’ అనే క్రైం థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు . కానీ ఈసారి డ్యూయల్ రోల్ లో నటించనున్నాడు. ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘చిత్ర లహరి’ లాంటి క్లాస్ సినిమాలు తీసే డైరెక్టర్ కిశోరె తిరుమల డైరెక్క్షన్ లో ఒక క్రైం థ్రిల్లర్ లో రామ్ నటించాడు. ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ ఇవాళ విడుదల అయింది.
ఈ సినిమాలో రామ్ డ్యూయల్ రోల్ లో కనిపించినట్టు ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. సాఫ్ట్ రోల్ ఒకటి పూర్తి మాస్ రోల్ ఒకటి అని అర్ధం అవుతుంది. ట్రైలర్ ని బట్టి చూస్తే సినిమాలో ఎవరు పాజిటివ్ క్యారెక్టర్ ఎవరు నెగటివ్ కారెక్టర్ అనే స్క్రీన్ ప్లే పైన్నే సినిమా ఆధారపడి ఉన్నట్టు అర్ధం అవుతుంది. ఈ సినిమాలో రామ్ డ్యూయల్ రోల్ లో ఇద్దరు అన్న దమ్ముల పాత్రల్లో నటించినట్టు అనిపిస్తుంది. ఈ సినిమా తమిళ్ లో విడుదలైన ‘తడమ్’ సినిమాకి రీమేక్ అని వినిపిస్తుంది కానీ అధికారిక ప్రకటన అయితే ఏమి లేదు. ఈ సినిమాలో మాళవిక శర్మ, అమృత అయ్యర్ మరియు ఒక ప్రత్యేక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నివేత పేతురాజ్ నటిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ ద్వారా ఇండస్ట్రీ కి కంబ్యాక్ ఇచ్చిన మ్యూజిక్ కంపోజర్ మణి శర్మ ఈ సినిమాకి కూడా అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చినట్టు ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. ఈ సినిమాని సంక్రాతి సందర్భంగా థియేటర్ లలో విడుదల చేస్తున్నారు.