టాలీవుడ్: వెన్నెల , ప్రస్తానం, ఆటో నగర్ సూర్య సినిమాలని రూపొందించిన దర్శకుడు దేవా కట్ట దర్శకత్వం లో సాయి ధరమ్ తేజ్ హీరోగా ‘రిపబ్లిక్’ అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తానం , ఆటో నగర్ సూర్య లాంటి ఇంటెన్సిటీ సినిమాల తర్వాత మంచి కంటెంట్ ఉన్న దర్శకుడిగా దేవా కట్టకి పేరుంది కానీ టైం సెట్ అవక ఇన్ని రోజులు అవకాశాలు పొంది సక్సెస్ సాధించడంలో వెనకపడ్డాడు. కానీ ఇప్పుడు మరో హై ఇంటెన్స్ పొలిటికల్ డ్రామా ని సిద్ధం చేస్తున్నాడు.
రిపబ్లిక్ సినిమాలో రమ్యకృష్ణ ఒక కీలక పాత్ర పోషిస్తుంది అని ఇదివరకే తెలిపారు. మరి ఆ కారెక్టర్ పాజిటివ్ లేదా నెగటివ్ క్యారెక్టర్ అని ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు కానీ ఈరోజు ఈ సినిమా నుండి రమ్యకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది సినిమా టీం. ‘తప్పు ఒప్పులు లేవు , అధికారం మాత్రమే శాశ్వతం’ అనే లైన్ తో రమ్యకృష్ణ ఫస్ట్ లుక్ విడుదల చేసారు. దీనిని బట్టి చూస్తే అధికారం కోసం ఏదైనా చేసే నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో రమ్యకృష్ణ నటిస్తుందని అర్ధం అవుతుంది.
ఈ సినిమాలో గవర్నెన్స్ పైన పోరాటం చేసే ఒక ఇంటెన్స్ రోల్ లో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నట్టు టీజర్, పోస్టర్స్ ద్వారా అర్ధం అవుతుంది. ఈ సినిమాని మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కి జోడీ గా తమిళ నటి ఐశ్వర్య రాజేష్ మరో కీలకపాత్రలో నటిస్తుంది. జీ స్టూడియోస్ మరియు జె.బి. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జె.భగవాన్, జె.పుల్లారావు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాని జూన్ 4 న థియేటర్లలో విడుదల చేయనున్నట్టు ఇదివరకే ప్రకటించారు.