టాలీవుడ్: కెరీర్ ప్రారంభం నుండి హీరో పాత్ర అని ముడి కట్టుకొని కూర్చోకుండా తన దగ్గరికి వచ్చిన ప్రతీది నటనకి ఆస్కారం ఉండేది ఐతే ఆ అవకాశాన్ని వొదిలిపెట్టకుండా విలక్షణమైన పాత్రలతో కెరీర్ ని ముందుకుతీసుకెళ్తున్న హీరో ‘దగ్గుబాటి రానా’. అలాంటి ఒక పాత్రతోనే ‘అరణ్య’ అనే సినిమాతో వస్తున్నాడు. అస్సాం లో అడవులని రక్షించే ఒకరి కథ ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. ఇది పాన్ ఇండియా సినిమాగా వివిధ భాషల్లో రూపొందించబడుతుంది. కరోనా కి ముందే సినిమా దాదాపు పూర్తి అయింది. కానీ కరోనా సంక్షోభం వల్ల విడుదల ఆలస్యం అయింది. నిన్ననే ఈ సినిమా గురించి ఒక అప్డేట్ రానా విడుదల చేసారు. ఈ సినిమాని సంక్రాంతికి థియేటర్ లలో విడుదల చేయబోతున్నట్టు తెలిపాడు.
చాలా రోజుల నుండి ఈ సినిమాని ఓటీటీ లో విడుదల చేస్తున్నారు అని రూమర్స్ చక్కర్లు కొట్టాయి. కానీ రానా ప్రకటన ద్వారా ఇటు విడుదల తేదీ అలాగే ఈ రూమర్స్ కి కూడా చెక్ పడింది అని చెప్పవచ్చు. ఈ సినిమాని ‘గజరాజు’ (తమిళ్ లో కుంకీ) లాంటి సినిమాని రూపొందించిన ప్రభు సాల్మన్ దర్శకత్వం వచించాడు. ఇందులో రానా తో పాటు విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియ నటిస్తున్నారు. ప్రకృతి ప్రాధాన్యత, అడవులు మరియు అడవుల్లో జంతువుల మనుగడ వంటి అంశాల ఆధారంగా ఈ సినిమా రూపొందించబడుతుంది. ఇప్పటికి సంక్రాంతి సీజన్ కి చాలా సినిమాలే పోటీలో ఉన్నాయ్. ఇపుడు ఈ సినిమాకూడా వచ్చి చేరింది.