టాలీవుడ్‌లో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రానా దగ్గుబాటి, ఈసారి సోలో హీరోగా మాస్ సినిమాతో రాబోతున్నాడు. లీడర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రానా, తర్వాత విలన్, మల్టీస్టారర్ క్యారెక్టర్లతో ఎక్కువగా కనిపించాడు. కానీ ఇప్పుడు మళ్లీ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌తో వస్తున్నాడన్న వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ కొత్త సినిమాకు కథను అందిస్తోన్నది లెజెండరీ రైటర్ చిన్నికృష్ణ. చిరంజీవి ఇంద్ర, బాలకృష్ణ నరసింహ నాయుడు వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు స్క్రిప్ట్ అందించిన ఆయన, ఇప్పుడు రానా కోసం ఓ పవర్‌ఫుల్ మాస్ కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ కథలో రౌడీ ఎలిమెంట్స్, పవర్‌ఫుల్ ఫైట్స్, సోషల్ మెసేజ్ కూడా ఉండబోతున్నాయట. అయితే, సినిమాకు డైరెక్టర్ ఎవరు? అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. రానా కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు టాక్.
అంతేకాదు, రానా గతంలో తేజ దర్శకత్వంలో రాక్షస రాజు అనే సినిమా ప్రకటించినా, అది సెట్స్ మీదకు వెళ్లకముందే క్యాన్సిల్ అయ్యింది. ఇప్పుడు మాత్రం ఈ కొత్త ప్రాజెక్ట్ పూర్తి కాన్ఫిడెంట్‌గా ఉందని ఫిల్మ్‌నగర్ సమాచారం.
ఇప్పటికే రానా అభిమానులు ఆయన మళ్లీ సోలో హీరోగా నటించబోతున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి, చిన్నికృష్ణ కథతో రానా మాస్ హీరోగా సక్సెస్ అందుకుంటాడా? అనేది చూడాలి.