హైదరాబాద్: గుణశేఖర్, ఒక మూస ధోరణిలో వెళ్లకుండా తాను తీసే ప్రతి సినిమాలో తన ప్రత్యేకతను చాటుకుంటాడు. తన చివరి ప్రయత్నం ‘రుద్రమ దేవి‘ , ఒక చారిత్రాత్మక సినిమాని చాలా అద్భుతంగా తీశారు. కానీ గ్రాఫిక్స్ కుదరకపోవడం వల్ల సినిమా అంతగా ఆడలేదు. కంటెంట్ పరంగా గుణశేఖర్ కి పేరొచ్చినా కానీ గ్రాఫిక్స్ పరంగా కొన్ని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు గుణశేఖర్ తన తదుపరి ప్రయత్నంగా హిరణ్య కశ్యప అనే సినిమాని మొదలుపెట్టారు. ఈ సినిమాకి చాల రోజులనుండి ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ సినిమా నుండి గుణశేఖర్ ఒక అప్డేట్ ఇచ్చారు. 3 సంవత్సరాలుగా చెస్తున్న ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిగా అయిపోయాయి, కరోనా పరిస్థితులు మెరుగు పడ్డాక షూటింగ్ ఒక్కటే మిగిలిపోయింది అన్నట్టు ట్విట్టర్ లో అప్డేట్ ఇచ్చారు.
ఈ సినిమాలో రానా టైటిల్ రోల్ పోషిస్తున్నారు. రానా కూడా ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న సినిమాలు అన్ని ముగించుకొని కొన్ని చివరి దశలో ఉన్నాయి. తాను కూడా షూటింగ్ మొదలవగానే వెయిటింగ్ లేకుండా షూటింగ్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ సినిమా గుణశేఖర్ మరియు సురేష్ ప్రొడక్షన్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో నిర్మించే పనిలో ప్రొడ్యూసర్స్ ఉన్నారు. రుద్రమదేవి లో జరిగిన తప్పులు ముఖ్యంగా గ్రాఫిక్స్ లో జరిగిన పొరపాట్లు ఇక్కడ జరగకుండా ఉండాలని చాలామంది అభిమానులు సలహాలు ఇస్తున్నారు.