WWE రెసిల్ మేనియాలో టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి అరుదైన ఘనత సాధించాడు. అమెరికాలో జరిగిన రెసిల్ మేనియా 41 ఈవెంట్‌కు హాజరైన మొదటి ఇండియన్ సినీ నటుడిగా రానా నిలిచాడు. లాస్ వెగాస్ వేదికగా జరిగిన ఈ ఈవెంట్‌లో పాల్గొనడం ద్వారా రానా అభిమానులను ఆనందంలో ముంచెత్తాడు.
వైట్ అండ్ బ్లాక్ స్టైలిష్ అవుట్‌ఫిట్‌లో రానా ఆకట్టుకోగా, ఈవెంట్ హోస్ట్ అతని సినిమాలు, నటన గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. నెట్‌ఫ్లిక్స్‌లో ‘రానా నాయుడు’ శ్రేణి ప్రసారం అవుతుండగా, అదే సమయంలో WWE ఈవెంట్‌లో పాల్గొనడం రానా చెబుతున్నట్టు ఓ ఫుల్ ఫిల్ అనుభవమట.
బాల్యంలో ఎంతో ఇష్టపడిన WWEని ప్రత్యక్షంగా చూడడం, ప్రపంచ వేదికపై భారత్‌కి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమని తెలిపారు. ఇప్పటికే ఆయన పలువురు రెజ్లర్లను కలిసి మాట్లాడినట్టు సమాచారం. WWEపై ఉన్న అభిమానం ద్వారా రానా ఈ స్పెషల్ అటెండెన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
రానా నటుడిగా చివరిసారి ‘విరాట పర్వం’లో కనిపించగా, ఇటీవల రజనీకాంత్‌తో కలిసి ‘వేట్టయాన్’లో కీలక పాత్ర పోషించారు. సినిమాలతో పాటు ఇప్పుడు ఇంటర్నేషనల్ ఈవెంట్‌లకు హాజరవుతూ తన స్థాయిని పెంచుకుంటున్నాడు.
అప్రిల్ 19-20 మధ్య జరిగిన రెసిల్ మేనియాలో జాన్ సేనా విజయం సాధించి 17 టైటిల్స్‌తో రికార్డ్ క్రియేట్ చేయగా, ఈ హిస్టారిక్ మోమెంట్‌ను రానా ప్రత్యక్షంగా చూసిన నటుడిగా ట్రెండ్ అవుతున్నారు.