fbpx
Thursday, May 15, 2025
HomeMovie Newsమరోసారి మొదలవనున్న రానా టాక్ షో

మరోసారి మొదలవనున్న రానా టాక్ షో

RanaTalkShow No1Yaari Season3CurtainRaiser

టాలీవుడ్: ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న హీరోలు కేవలం హీరోలుగా మాత్రమే కాకుండా రకరకాల పాత్రలు పోషిస్తూ మల్టీ టాలెంటెడ్ అని ప్రూవ్ చేసుకుంటున్నారు. అందులో దగ్గుబాటి రానా లాంటి వాళ్ళు ఇంకా కొన్ని ఎక్కువ రంగాల్లో తన నైపుణ్యం చూపిస్తున్నాడు. హీరోగా రాకముందు గ్రాఫిక్ కంపెనీ ప్రారంభించాడు. హీరోగా, కారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా ఇలా ఆన్ స్క్రీన్ రక రకాల పాత్రలు పోషిస్తూ నిర్మాతగా ‘C /O కంచరపాలెం‘ లాంటి సినిమాని నిర్మించి సురేష్ ప్రొడక్షన్స్ లెగసీ ని కంటిన్యూ చేస్తున్నాడు. ఇవే కాకుండా ‘నెంబర్ వన్ యారి’ అనే టాక్ షో కూడా ప్రారంభించాడు.

ఇదివరకే రెండు సీజన్లు టెలికాస్ట్ అయినా ఈ షో మూడవ సీజన్ ప్రారంభం అవనుంది. ఇదివరకే టెలివిజన్ లో ప్రసారమైన ఈ షో ఈ సారి ఆహ ఓటీటీ లో ప్రాసారం అవనుంది. మొదటి సీజన్లో తన ఫ్రెండ్స్ ని ఇంటర్వ్యూ చేసి, రెండవ సీజన్ లో ఇండస్ట్రీ లో ఉన్న ఫ్రెండ్స్ ని ఇంటర్వ్యూ చేసిన ఈసారి మరో కొత్త కాన్సెప్ట్ తో, కొత్త జోడీలతో రాబోతున్నట్టు తెలిపాడు. ఈ సీజన్ ఎపిసోడ్స్ ని మార్చ్ 14 నుండి ఆహ లో టెలికాస్ట్ చేయనున్నట్టు కూడా ప్రకటించారు. ఇదివరకే సమంత తో ‘సామ్ జామ్’ టాక్ షో నిర్వహించిన ఆహ టీం అదంత హిట్ అవకపోవడం తో ఆల్రెడీ హిట్ అయినా కాన్సెప్ట్ తోనే ఈ సీజన్ 3 ని స్ట్రీమ్ చెయ్యబోతున్నారు.

No. 1 Yaari Promo Season 3 | Rana Daggubati | An aha Original

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular