బాలీవుడ్: అర్జున్ రెడ్డి అనే ఒక్క సినిమాతో ఇండస్ట్రీ చూపుని మొత్తం తన వైపు తిప్పుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమా తర్వాత తెలుగులో మహేష్ బాబు తో సినిమా చేస్తున్నాడు అని వార్తలు వచ్చాయి కానీ బాలీవుడ్ కి వెళ్లి షాహిద్ కపూర్ తో సినిమా తీసాడు. తెలుగు లో తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అర్జున్ రెడ్డి సినిమానే హిందీ లో ‘కబీర్ సింగ్’ అనే సినిమా గా రీమేక్ చేసి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇపుడు బాలీవుడ్ మరో కేజ్రీ హీరో రణబీర్ కపూర్ తో సినిమా చేస్తూ మరోసారి టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు సందీప్ రెడ్డి వంగా.
సందీప్ వంగా మరియు రణబీర్ కపూర్ ల సినిమాకి సంబందించిన అనౌన్స్మెంట్, టైటిల్ టీజర్ మరియు ఈ సినిమాలో నటించే నటులకి సంబందించిన ఒక చిన్న టీజర్ ని న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేసారు. ఈ సినిమాని ‘ఆనిమల్‘ అనే టైటిల్ తో రూపొందిస్తున్నారు. ఇందులో రణబీర్ కపూర్ తో పాటు అనిల్ కపూర్, బాబీ డియోల్, పరిణీతి చోప్రా నటిస్తున్నారు. టీజర్ రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్ తో ఉంది. బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే మ్యూజిక్ కూడా ఆకట్టుకుంది. టీజర్ ని బట్టి చూస్తే ఇదొక వింటేజ్ సినిమా లాగ అనిపిస్తుంది. సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి లో ప్రారంభించబోతున్నట్టు తెలిపారు. అంతే కాకుండా ఈ సినిమా నిర్మాణంలో తన సొంత బ్యానర్ అయిన ‘భద్రకాళి పిక్చర్స్’ ని కూడా భాగస్వామ్యం చేసాడు డైరెక్టర్. టీజర్ లో వినిపించే లైన్స్ తోనే సందీప్ మరోసారి మ్యాజిక్ చేయబోతున్నారు అని హింట్ ఇచ్చాడు.