హైదరాబాద్: టాలీవుడ్ హీరో నితిన్ ఈరోజు పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ ఈవెంట్ ఇంకా మెమొరబుల్ చెయ్యడానికి నితిన్ ప్రస్తుతం నటిస్తున్న రంగ్ దే సినిమా టీం ఒక క్యూట్ గిఫ్ట్ ప్రెసెంట్ చేసింది. నితిన్ పెళ్లి కానుక అని ఒక టీజర్ విడుదల చేసింది. నితిన్ పెళ్లి సందర్భంగా సినిమాలో పెళ్లి చుట్టూ జరిగే సీన్స్ తోనే టీజర్ కట్ చేసి విడుదల చేసారు. ఈ సినిమాలో నితిన్ తో పాటు మహానటి కీర్తి సురేష్ నటింస్తున్నారు. థమన్ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాకి మరో ఆకర్షణ పీ సీ శ్రీరామ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. వరుణ్ తేజ్ తో తొలిప్రేమ, అఖిల్ తో మజ్ను లాంటి మంచి ప్రేమ కథలని తీసిన వెంకీ అట్లూరి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈరోజు విడుదల చేసిన టీజర్ ఆద్యంతం ఒక సెలబ్రేషన్ లాగ సాగిపోయింది. లవ్, ఫ్యామిలీ, ఎమోషన్స్ చుట్టూ అల్లుకున్న సినిమాలాగే అనిపిస్తుంది. టీజర్ ఉన్న కొంచెం సేపు ఒక వేడుకలా ఉంది. ‘బస్టాండే బస్టాండే బతుకు బస్టాండే ‘ అంటూ వచ్చే సీన్స్ లో నితిన్ కామెడీ, పెళ్లి ఐతే బతుకు బస్టాండే అనే కామెడీ తో టీజర్ ఆకట్టుకుంది. చివరకి సంక్రాంతి కి విడుదల చేస్తాం (అన్ని కుదిరితే) అని కూడా చెప్పారు. కరోనా సంక్షోభం లేకపోతే ఈపాటికే సినిమా విడుదల అవ్వాల్సింది. మొత్తానికి నితిన్ కి మంచి పెళ్లి కనుక ఇచ్చారు ‘రంగ్ దే’ సినిమా టీం.