fbpx
Sunday, January 19, 2025
HomeMovie Newsమహేష్ చేతుల మీదుగా 'ఉప్పెన' సాంగ్

మహేష్ చేతుల మీదుగా ‘ఉప్పెన’ సాంగ్

Ranguladdukunna SongFrom UppenaMovie

టాలీవుడ్: మెగా కుటుంబం నుండి రాబోతున్న మరో హీరో ‘వైష్ణవ్ తేజ్’. మెగా మెన్నల్లుడు వైష్ణవ్ తేజ్ హీరో గా రాబోతున్న మొదటి సినిమా ‘ఉప్పెన’. సుకుమార్ రైటింగ్స్ పేరుతో, సుకుమార్ కథ స్క్రీన్ ప్లే అందించబోతున్నాడు. సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ బుచ్చిబాబు ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా నుండి ఇప్పటికే ‘నీ కన్ను నీలి సముద్రం’, ‘ధక్ ధక్’ పాటలు విడుదలై సూపర్ హిట్ గా నిలిచాయి. ఇపుడు ‘రంగులద్దుకున్న’ అనే మూడో పాటను మహేష్ చేతులమీదుగా విడుదల చేయించబోతున్నారు మేకర్స్. ఈ సందర్భంగా కరోనా సమయంలో వర్చువల్ మీటింగ్ పేరుతో మ్యూజిక్ సిట్టింగ్స్ పై ఒక వీడియో విడుదల చేసారు.

ఈ వీడియోలో డైరెక్టర్ బుచ్చిబాబు సీన్ వివరించగా మ్యూజిక్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ ఒక ట్యూన్ ని పాడి వినిపిస్తారు. అది విని ఈ పాట బాగుందని , ఈ మూడో పాటతో హ్యాట్రిక్ కొట్టబోతున్నామని ఆనందపడతారు డైరెక్టర్. ఇంతలో సుకుమార్ కూడా వీడియో లో ఆడ్ అవుతాడు. ఇలాంటి సూపర్ హిట్ పాటని సూపర్ స్టార్ చేతుల మీదుగా విడుదల చేయిద్దాం అంటాడు. మహేష్ చేతుల మీదుగా ఈ పాటని నవంబర్ 11 న దీపావళి సందర్భంగా విడుదల చెయ్యబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమా మర్చి లోనే విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా బ్రేక్ పడింది. థియేటర్లు తెరచుకోగానే మంచి సమయం చూసుకొని విడుదల చేయడానికి ఈ సినిమా రెడీ గా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular