ముంబై: భారతదేశంలోని సుమారు 300 చిన్న బ్యాంకులు కు సేవలు అందిస్తున్న సి-ఎడ్జ్ టెక్నాలజీస్‌పై రాన్సమ్‌వేర్ దాడి చోటుచేసుకుంది.
ఈ దాడి కారణంగా పేమెంట్ సిస్టమ్స్ తాత్కాలికంగా నిలిచిపోయాయి. సి-ఎడ్జ్ టెక్నాలజీస్ ఈ విషయంపై స్పందించలేదు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా రాయిటర్స్ అభ్యర్థనపై స్పందించలేదు. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) బుధవారం రాత్రి ఒక పబ్లిక్ అడ్వైజరీలో సి-ఎడ్జ్ టెక్నాలజీస్‌ను రిటైల్ పేమెంట్ సిస్టమ్ నుండి తాత్కాలికంగా వేరుచేసినట్లు ప్రకటించింది.
ణ్ఫ్ఛీ ప్రకటన ప్రకారం, “సి-ఎడ్జ్ ద్వారా సేవలు పొందుతున్న బ్యాంకుల కస్టమర్లు ఈ కాలంలో పేమెంట్ సిస్టమ్స్‌ను ఉపయోగించలేరు.”
ఈ పరిస్థితి నుండి పెద్ద ప్రభావాన్ని నివారించడానికి దాదాపు 300 చిన్న బ్యాంకులు దేశంలోని విస్తృత పేమెంట్ నెట్‌వర్క్ నుండి వేరుచేసినట్లు అధికారులు తెలిపారు.