fbpx
Saturday, September 7, 2024
HomeMovie Newsరణ్వీర్ హీరోగా హిందీ 'అపరిచితుడు'

రణ్వీర్ హీరోగా హిందీ ‘అపరిచితుడు’

RanveerSingh AsAparichithudu Bollywood

బాలీవుడ్: చియాన్ విక్రమ్ హీరోగా, భారీ సినిమాలు రూపొందించే శంకర్ దర్శకుడిగా 2005 సంవత్సరంలో ‘అపరిచితుడు’ అనే సినిమా రూపొంది సూపర్ హిట్ గా నిలిచింది. సమాజం లో జరుగుతున్ననిర్లక్ష్యాల్ని , చిన్న చిన్న తప్పులు ఎలాంటి ప్రమాదాలకు దారి తీస్తాయో చూపించి ఆలా తప్పులు చేసే వాళ్ళకి నరకంలో ఎలాంటి శిక్షలు వేస్తారో అవి సమాజంలో బ్రతుకున్న ఒక వ్యక్తి తనకి తెలియకుండానే తనలోని ‘అపరిచితుడు’ అనే పాత్ర ద్వారా శిక్షిస్తూ ఉంటాడు హీరో. ఈ సినిమా తెలుగు మరియు తమిళ్ లో సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా అదే టైం లో హిందీ లో కూడా విడుదలైంది కానీ అంతగా ఆదరణ నోచుకోలేదు.

16 సంవత్సరాల తర్వాత ఈ సినిమాని రణ్వీర్ సింగ్ హీరోగా హిందీ లో శంకర్ దర్శకత్వంలో రూపొందించనున్నారు. కానీ శంకర్ ఈ సినిమాని ఇప్పుడు ఉన్న పరిస్థితులతో చాలా సన్నివేశాలు మార్చనున్నట్టు కూడా తెలిపారు. రణ్వీర్ తో ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉందని, రామ్ చరణ్ తో రూపొందే సినిమా ముగిసిన తర్వాత 2022 ద్వితీయార్థంలో ఈ సినిమా మొదలవనున్నట్టు ట్విట్టర్ లో తెలిపారు. మామూలుగా శంకర్ రీమేక్ సినిమాలు చేయదు. తన కెరీర్ లో ఇప్పటి వారికి 3 ఇడియట్స్ సినిమాని రీమేక్ చేసాడు. ఇపుడు తన సినిమానే రీమేక్ చేయబోతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular