మూవీడెస్క్: టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కొత్త సినిమా RAPO 22 కోసం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
ఇటీవల డబుల్ ఇస్మార్ట్ తో ప్రేక్షకులను పలకరించిన రామ్, మరింత బలమైన హిట్ కొట్టాలని భావిస్తున్నారు.
ఈసారి డైరెక్టర్ పి. మహేష్ తో కలిసి ఫీల్ గుడ్ క్రేజీ ఎంటర్టైనర్ను తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాలో హీరోయినగా యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే నటిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాణం చేపట్టారు.
పూజా కార్యక్రమాలు పూర్తయి, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
తాజాగా ఈ సినిమాకి సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చింది.
కోలీవుడ్ ప్రముఖ సంగీత ద్వయం వివేక్-మెర్విన్ తమ టాలీవుడ్ ప్రయాణాన్ని RAPO 22తో ప్రారంభిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఇప్పటికే తమిళ ఇండస్ట్రీలో పలు బ్లాక్ బస్టర్ ఆల్బమ్‌లతో సూపర్ క్రేజ్ అందుకున్న ఈ జోడి, ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడానికి సిద్ధమవుతున్నారు.
వివేక్-మెర్విన్ పటాస్, ఒరా సౌధ వంటి పలు హిట్ సాంగ్స్ అందించారు. ఇప్పుడు RAPO 22కి కొత్త స్టైల్ మ్యూజిక్ అందించనున్నారు.
ఈ మేరకు రామ్ కూడా సోషల్ మీడియాలో “తెలుగు ఇండస్ట్రీకి కొత్త సౌండ్‌కి స్వాగతం” అంటూ పోస్టు చేశారు.
ఇప్పటికే మ్యూజిక్ లవర్స్ ఈ అనౌన్స్‌మెంట్‌పై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
టాలీవుడ్లో కూడా వీరి మ్యూజిక్ మేజిక్ హిట్ కావాలని కోరుకుంటున్నారు. మరి RAPO 22 తో వీరు ఎంతటి ఘనత సాధిస్తారో వేచి చూడాలి!