మూవీడెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో అత్యున్నత స్థానం దక్కించుకున్న నిర్మాణ సంస్థల్లో మైత్రీ మూవీ మేకర్స్ ఒకటి.
మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు తో 2015లో ఈ సంస్థ ప్రయాణం మొదలైంది. అప్పటి నుంచి వరుస విజయాలతో మైత్రీ సంస్థ ఎంతో గుర్తింపు సాధించింది.
ప్రస్తుతం పాన్-ఇండియా స్థాయిలో ప్రాజెక్టులను నిర్మిస్తూ, దేశవ్యాప్తంగా ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటోంది.
మైత్రీ సంస్థ సహ వ్యవస్థాపకుడు నవీన్ యెర్నేనికి జన్మదిన సందర్భంగా ప్రత్యేక ఘనత లభించింది.
మైత్రీ బ్యానర్‌లో ప్రస్తుతానికి లైన్‌లో ఉన్న 11 ప్రాజెక్టుల బృందాలు నవీన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక పోస్టర్లను విడుదల చేశాయి.
ఈ అరుదైన సొగసైన ఘనత సినిమాపరంగా తొలిసారి చోటు చేసుకుంది.
ప్రస్తుతం మైత్రీ పుష్ప 2: ది రూల్ వంటి భారీ చిత్రంతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్, ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్, రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమా వంటి పాన్-ఇండియా స్థాయి చిత్రాలను నిర్మిస్తోంది.
ఇదే కాకుండా సన్నీ డియోల్-గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో జాట్, రామ్-మహేష్ బాబు RAPO22 వంటి వినూత్న చిత్రాలు కూడా రాబోతున్నాయి.
నవీన్ నిర్మాణ విలువలు, ఆయన కథల ఎంపికపై చూపే ప్రత్యేక శ్రద్ధ మైత్రీ మూవీ మేకర్స్ విజయాలకు పునాది వేస్తున్నాయి.
వివాదాల నుంచి దూరంగా, సౌమ్య స్వభావంతో నవీన్ పరిశ్రమలో అందరి మన్ననలు పొందారు.
మైత్రీ సంస్థ తెలుగు సినిమాను ప్రపంచవ్యాప్తంగా నిలబెడుతూనే, పాన్-ఇండియా స్థాయిలో భారతీయ సినిమా చరిత్రలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది.