మూవీడెస్క్: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. పుష్ప-2 లో శ్రీవల్లి పాత్రను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
ఇదే సమయంలో పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో పాటు లేడీ ఓరియెంటెడ్ కథలపైనా దృష్టి పెట్టారు.
అందులో భాగంగానే రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఇప్పటికే కొన్ని గ్లింప్స్‌ను విడుదల చేసి ప్రేక్షకుల ఆసక్తిని పెంచారు.
రష్మిక నటన, ఆమె ఎమోషనల్ ఎక్స్‌ప్రెషన్స్ ఈ చిత్రానికి హైలైట్ కానున్నాయని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే, తాజాగా మేకర్స్ ఈ చిత్ర టీజర్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
ఇక ది గర్ల్ ఫ్రెండ్ టీజర్‌లో ఓ స్పెషల్ ఎలిమెంట్ ఉండబోతోందని సమాచారం. రష్మిక పాత్రను నెరేట్ చేసే సీన్స్‌కి స్టార్ హీరో విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్ ఇచ్చారని ఇండస్ట్రీలో చర్చ సాగుతోంది.
టీజర్‌లో “అస్సలు పడను” అనే డైలాగ్ విజయ్ వాయిస్‌లో ఉంటుందని టాక్. దీంతో ఈ వార్త నెటిజన్లలో హాట్ టాపిక్‌గా మారింది.
విజయ్, రష్మిక రిలేషన్‌పై గాసిప్స్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ కాంబినేషన్ పై మరింత చర్చ జరుగుతోంది.
ప్రేక్షకులంతా ఈ టీజర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్న ఈ సినిమా కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
మరి రష్మిక ఈ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటారేమో చూడాలి.