బాలీవుడ్: ‘కిరాక్ పార్టీ’ అనే సినిమా ద్వారా కన్నడ ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయం అయిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ‘చలో’ సినిమా సూపర్ సక్సెస్ అయిన తర్వాత వరుసగా ఆఫర్లు కొట్టి కేవలం రెండు సంవత్సరాల్లోనే సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లాంటి హీరో లతో సినిమాలు చేసే స్టేజ్ కి వచ్చింది. ఈ మధ్యనే కార్తీ తో తమిళ్ లో తన మొదటి సినిమా పూర్తి చేసింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ హిందీ లో ఒక సినిమా చేయబోతుంది. సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా నటించనున్న ఒక సినిమా ద్వారా బాలీవుడ్ కి పరిచయం అవబోతుంది ఈ హీరోయిన్.
‘మిషన్ మజ్ను’ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న నటించనున్నట్టు ఇవాళ అధికారికంగా ప్రకటించారు. ‘ది అన్ టోల్డ్ స్టోరీ అఫ్ ఇండియస్ గ్రేటెస్ట్ కోవర్ట్ ఆపరేషన్’ అంటూ ‘సిద్దార్థ్ మల్హోత్రా’ పోస్టర్ తో ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసారు. ఇది ఒక పీరియాడిక్ కథ అని టాగ్ లైన్ మరియు ఫస్ట్ లుక్ చూస్తే తెలుస్తుంది. ప్రముఖ ప్రొడ్యూసర్ రోనీ స్క్రూవాలా నిర్మాణం లో ఈ సినిమా రూపొందుతుంది. శాంతను బాగ్చి అనే నూతన దర్శకుడు ఆద్వర్యం లో ఈ సినిమా రూపొందుతుంది. ఒక మలయాళం తప్ప సౌత్ లో అన్ని ఇండస్ట్రీస్ లో చాలా తక్కువ కాలం లో తన ప్రతిభ చాటుకున్న రష్మిక బాలీవుడ్ లో కూడా రాణిస్తుందని ఆశిద్దాం.