ముంబై: భారత దిగ్గజ వ్యాపారవేత్త, దార్శనికుడు రతన్ టాటా ( RATAN TATA ) ఇక లేరు! ఇవాళ ముంబైలోని ఒక ఆసుపత్రిలో ఆయన అనారోగ్య కారణాల వల్ల కన్ను మూశారు.
ఇది తలచుకోవడానికి, చెప్పడానికి చాలా ఇబ్బందికర సమాచారం.
కాగా, సోమవారమే ఆయన ఆరోగ్య విషయమై వచ్చిన వార్తలను ఖండించిన ఆయన ఇవాళ హఠాత్తుగా మరణించడం జరిగింది.
అయితే, ఎన్నో సవాళ్ళను అధిగమించి, వ్యాపారం ఎలా చేయాలో అలాగే సంపాదించిన దాన్ని ధార్మిక అవసరాలకు ఎలా వినియోగించాలనేది ఆయనను చూసి నేర్చుకోవాల్సిన విషయం.
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే దానికి ఆయన నిలువెత్తు నిదర్శనం!
శోకాతప్త హృదయాలతో ఆయనకు శ్రద్ధాంజలి మరియు నీరాజనాలు అందిస్తూ అయన ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా ప్రార్థిస్తోంది The2States.com. RIP RATAN TATA