తిరుమల: తిరుమల శ్రీవారికి రతన్ టాటా సేవలు
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా శ్రీవారికి పరమ భక్తుడిగా విఖ్యాతి పొందారు. ఆయనకు తిరుమల, తిరుపతితో ఉన్న ప్రత్యేక అనుబంధం, టీటీడీ సేవలలో ఆయన చేసిన కీలక ప్రమేయం ఆయన్ని మరింత వెలుగులోకి తెచ్చింది. తిరుమలలో భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా సేవలను సాంకేతికంగా మెరుగుపరచడంలో రతన్ టాటా కీలకపాత్ర పోషించారు.
టీటీడీకి టీసీఎస్ సేవలు:
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) టీటీడీకి ఉచితంగా సాఫ్ట్‌వేర్ సేవలు అందిస్తోంది. 2015 నుంచి టీసీఎస్ టీటీడీ సేవలను పారదర్శకంగా నిర్వహించేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తోంది. టికెట్ల బుకింగ్, గదుల కేటాయింపు, ఆర్జిత సేవలు, విరాళాల సేకరణ వంటి సేవలను ఆన్‌లైన్ ద్వారా అందించడం ద్వారా భక్తుల సౌకర్యాలను మెరుగుపరిచారు. వీటితో పాటు, కల్యాణ వేదిక, ఈ-హుండీ, ఈ-పబ్లికేషన్ వంటి సేవలు కూడా ఆన్‌లైన్‌లో అందిస్తున్నారు.
స్వీకార్ క్యాన్సర్ ఆస్పత్రి:
రతన్ టాటా ఆధ్వర్యంలోని టాటా ట్రస్ట్ తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ సెంటర్ (స్వీకార్)ను స్థాపించారు. టీటీడీతో కలిసి రూ.250 కోట్ల వ్యయంతో ఈ ఆస్పత్రిని నిర్మించారు, ఇది రాయలసీమ ప్రజలకు గొప్ప సహాయంగా నిలుస్తోంది.
పింక్ బస్సు సేవలు:
క్యాన్సర్‌ను ముందుగా గుర్తించేందుకు టాటా ట్రస్ట్ రాష్ట్రవ్యాప్తంగా “పింక్ బస్సు” సేవలను ప్రవేశపెట్టింది. ఈ బస్సు ద్వారా క్యాన్సర్ ప్రాథమిక పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేకమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి.
శ్రీసిటీతో టాటా అనుబంధం:
టాటా గ్రూప్ ష్రీసిటీలో టాటా స్మార్ట్ ఫుడ్ లిమిటెడ్ పరిశ్రమను స్థాపించింది, ఇది ఆర్టీఈ మార్కెట్‌లో రెండవ అతిపెద్ద కంపెనీగా నిలిచింది. 2019లో రతన్ టాటా ష్రీసిటీ సందర్శనకు వచ్చి అక్కడి పరిశ్రమల అభివృద్ధిని పరిశీలించారు.
టాటా సేవా నిరతి:
టాటా సంస్థలు శ్రీవారి సేవలను మెరుగుపర్చడంలో ఎనలేని కృషి చేశారు. ప్రతి సంవత్సరం సుమారు రూ.6 కోట్ల విలువైన సేవలను ఉచితంగా అందిస్తున్నారు. భక్తులకు సౌకర్యవంతమైన సేవలను అందించడంలో టీసీఎస్ కీలకపాత్ర పోషించింది.