స్పోర్ట్స్ డెస్క్: భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రిటైర్మెంట్‌పై వస్తున్న ఊహాగానాలకు స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన వెంటనే జడేజా వన్డేలకు వీడ్కోలు పలుకుతారని వార్తలు వెలువడ్డాయి. అయితే, జడేజా ఈ వార్తలను ఖండిస్తూ “నిరాధారమైన ప్రచారాలు నమ్మవద్దు.. ధన్యవాదాలు” అంటూ సోషల్ మీడియాలో స్పందించాడు.
న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ జడేజాను ఆలింగనం చేసుకోవడంతో, రిటైర్మెంట్ ఊహాగానాలకు ఊతమిచ్చింది. ఈ క్రమంలో, జడేజా భవిష్యత్తు గురించి అనేక కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ, జడేజా తన కెరీర్ కొనసాగిస్తానని పరోక్షంగా స్పష్టం చేశాడు.
గతేడాది టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత, రోహిత్ శర్మ, కోహ్లీ, జడేజా టీ20లకు గుడ్‌బై చెప్పారు. ఇప్పుడు వన్డేలకు కూడా వీడ్కోలు చెబుతారన్న ప్రచారం జరిగినా, రోహిత్, జడేజా ఇద్దరూ దీనిని ఖండించారు.
భారత క్రికెట్‌లో జడేజాకు ఇప్పటికీ కీలక స్థానం ఉంది. ముఖ్యంగా, వన్డే ఫార్మాట్‌లో జడేజా బౌలింగ్, బ్యాటింగ్‌తో జట్టుకు కీలక పాత్ర పోషిస్తూనే ఉన్నాడు.