టాలీవుడ్: మాస్ మహారాజ్ రవితేజ సినిమాలు చేయడం లో దూకుడు చూపిస్తూ దాదాపు సంవత్సరానికి మూడు సినిమాలు వచ్చేట్టు ప్లాన్ చేసుకుంటాడు. కానీ వరుసగా ప్లాప్ లు రావడంతో కొంచెం నెమ్మదించాడు. అయితే ప్రస్తుతం మళ్ళీ మునుపటి జోరు చూపించే ప్లాన్ లో ఉన్నాడు. ఈ సంవత్సరం ఆరంభం లో ‘డిస్కో రాజా’ తో పలకరించిన రవి తేజ అప్పటికే గోపి చంద్ మలినేని తో ‘క్రాక్’ అనే సినిమా సగం షూటింగ్ పూర్తి చేసాడు. లాక్ డౌన్ వల్ల ఇన్నిరోజులు షూటింగ్ నిలిచిపోవడం తో ఈ మధ్యనే మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టారు. ఇపుడు ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే మరో ప్రాజెక్ట్ కూడా లైన్ లో పెట్టాడు ఈ ఎనర్జిటిక్ హీరో.
రవి తేజ కెరీర్ లో 67 వ సినిమా గా రూపొందుతున్న ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ ఇవాళ విడుదలైంది. బెల్లం కొండ శ్రీనివాస్ తో ‘రాక్షసుడు’ సినిమాని రూపొందించి హిట్ చేసిన డైరెక్టర్ ‘రమేష్ వర్మ’ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ డైరెక్టర్ తో పనిచేయడం రవితేజ కి ఇది రెండవసారి. మొదటి సారి ‘వీర’ అనే సినిమాకి వీళ్ళద్దరు కలిసి పని చేసారు. ఏ స్టూడియోస్ మరియు ,పెన్ స్టూడియోస్ , హవీష్ ప్రొడక్షన్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ ప్రీ లుక్ పోస్టర్ లో స్టైలిష్ గా డాన్స్ చేస్తున్నట్లున్న రవితేజ షాడో ఇమేజ్ కనిపిస్తోంది. ఈ సినిమా ప్రారంభోత్సవం ఆదివారం జరగబోతుంది.