మూవీడెస్క్: సినీ ఇండస్ట్రీలో రవితేజ కుటుంబం నుంచి మరో తరం రంగప్రవేశానికి సిద్ధమవుతోంది.
రవితేజ కూతురు మోక్షధ ప్రస్తుతం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో ఉన్న ఓ సినిమాలో సహాయ దర్శకురాలిగా పని చేస్తోంది.
నటన కన్నా, డైరెక్షన్ శాఖపై ఆమె ఆసక్తి చూపిస్తుండటంతో, ఈ నిర్ణయం పరిశ్రమలో అందరినీ ఆకట్టుకుంది.
డైరెక్షన్‌పై ప్రత్యేక శిక్షణ తీసుకోవడమే కాకుండా, సినిమా నిర్మాణానికి సంబంధించిన మెళకువలను నేరుగా సెట్‌లో నేర్చుకుంటోంది.
మోక్షధ ఈ దిశగా అడుగులు వేస్తుండటంతో, ఆమె అందించే కృషి తెర వెనుక సృజనాత్మకతను మరింత వెలుగులోకి తీసుకువస్తుందని భావిస్తున్నారు.
రవితేజ తన పిల్లలకు సొంత కృషితో ముందుకు సాగడం నేర్పిన వ్యక్తిగా, ఈ ప్రొసెస్‌ను ఎంతో ప్రోత్సహిస్తున్నారు.
మహాధన్ కూడా ఇదే దారిలో డైరెక్షన్‌లో శిక్షణ పొందుతున్నాడట. రాజా ది గ్రేట్ లో తన పాత్రతో ఆకట్టుకున్న మహాధన్, ప్రస్తుతం తెర వెనుక శిక్షణను కొనసాగిస్తున్నాడు.
ఇంతకుముందు టాలీవుడ్‌లో సీనియర్ నటులు, దర్శకుల పిల్లలు వివిధ కోర్సులు చేసి ఇండస్ట్రీలో అడుగుపెట్టేవారు.
కానీ రవితేజ కుటుంబం నేరుగా పరిశ్రమలోనే అనుభవం సేకరిస్తూ ముందుకు సాగుతోంది.
ఈ విధానం వారికే కాకుండా, కొత్త తరానికి మార్గదర్శకంగా నిలుస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.