మూవీ డెస్క్: మాస్ హీరో రవితేజ నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ఖిలాడీ చిత్రీకరణ దాదాపు చివరి దశకు చేరింది. మాస్ మహరాజ్ అభిమానులకు చిత్ర దర్శకుడు మరియు నిర్మాతలు శుభవార్త తెలిపారు. ఈ రోజు వారు ఖిలాడీ సినిమా తేదిని ప్రకటించారు.
ఈ చిత్రం వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 11, 2022 న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఆ తేదిని పోస్టర్ ద్వారా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో రవితేజ సిగరెట్ తాగుతూ ఘాటైన మాస్ గెటప్‌లో కనిపించాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇదిలా ఉంటే చిత్రబృందం దూకుడుగా ప్రమోట్ చేస్తోంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన మొదటి రెండు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. విడుదల తేదీని ప్రకటించి, ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నందున, మేకర్స్ రాబోయే రోజుల్లో ప్రచారాన్ని పెంచనున్నారు.