టాలీవుడ్: ఈ సంవత్సరం ఆరంభం లోనే కరోనా తర్వాత విడుదలైన సినిమాల్లో మొదటి బ్లాక్ బస్టర్ అయిన ‘క్రాక్’ సినిమా ఇచ్చిన ఉత్సాహంలో ఉన్నాడు మాస్ మహారాజ్ రవితేజ. ఈ హీరో ప్రస్తుతం ‘ఖిలాడీ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈరోజు రవితేజ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీం రవి తేజ కి విషెస్ చెప్తూ ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ గ్లిమ్స్ వీడియో ని విడుదల చేసారు. ఈ వీడియో లో ఒక పోర్ట్ లాంటి ఏరియా లో కార్లు వెళ్తున్నట్టు చూపించి అవతల వైపు చేతిలో ఒక సుత్తి పెట్టుకుని వాళ్ళ కోసం ఎదురుచూస్తూ స్టైలిష్ లుక్ లో ఉన్న రవి తేజ ని చూపిస్తారు. బ్యాక్ గ్రౌండ్ లో దేవి శ్రీ ఎలివేషన్ మ్యూజిక్ ఆకట్టుకుంది.
ఈ సినిమాలో రవి తేజ రెండు పాత్రలు చేస్తున్నట్టు ఒక టాక్ కూడా ఉంది. బెల్లం కొండ సురేష్ తో ‘రాక్షసుడు’ సినిమాని డైరెక్ట్ చేసిన రమేష్ వర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఖిలాడీ’ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాకి ‘ప్లే స్మార్ట్’ అనేది టాగ్ లైన్. ఈ చిన్న వీడియో ని బట్టి ఈ సినిమా అల్ట్రా స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతుందని అర్ధం అవుతుంది. ఈ సినిమాలో రవి తేజ కి జోడీ గా మీనాక్షి చౌదరి మరియు డింపుల్ హయతి నటిస్తున్నారు. ఈ సినిమా ద్వారా దేవి శ్రీ ప్రసాద్ చాలా రోజుల తర్వాత రవి తేజ కి సంగీతం అందిస్తున్నారు. సంవత్సరం ఆరంభం లోనే క్రాక్ లాంటి హిట్ కొట్టిన రవితేజ ఈ సమ్మర్ వరకు ఈ సినిమాని విడుదల చేసే ఉదేశ్యం లో ఉన్నాడు.