టాలీవుడ్: టాలీవుడ్ మాస్ మహారాజ్ రవి తేజ ప్రస్తుతం క్రాక్ హిట్ జోష్ లో ఉన్నాడు. ఈ సంవత్సరం ఆరంభం లోనే సంక్రాంతికి క్రాక్ సినిమా విడుదల చేసి సూపర్ హిట్ కొట్టాడు. మే నెలలోనే మరో సినిమా విడుదల ప్రకటించి ఫస్ట్ హాఫ్ లోనే రెండు సినిమాలు విడుదల చేయబోతున్నాడు. రవి తేజ ప్రస్తుతం ‘ఖిలాడీ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి సంబందించిన విడుదల తేదీ ప్రకటించింది సినిమా టీం. మే 28 న థియేటర్ లలో ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్టు సినిమా టీం ప్రకటించింది.
ఈ మధ్యనే రవి తేజ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ గ్లిమ్స్ విడుదల చేసారు. చాలా స్టైలిష్ గా ఈ సినిమా రూపొందనున్నట్టు ఆ వీడియో ద్వారా తెలుస్తుంది. ఈ సినిమాలో రవి తేజ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో రవితేజ కి జోడీ గా మీనాక్షి చౌధరి మరియు డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘రాక్షసుడు’ సినిమాకి దర్శకత్వం వహించిన రమేష్ వర్మ ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కి దర్శకత్వం వహిస్తున్నారు. హవీష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సత్యనారాయణ కోనేరు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సంక్రాంతి మార్కెట్ ని క్యాష్ చేసుకున్న రవితేజ ఈ సినిమా ద్వారా సమ్మర్ మార్కెట్ ని కూడా క్యాష్ చేసుకునే పనిలో ఉన్నాడు.