హైదరాబాద్: కాదేది సినిమా ప్రొమోషన్ ని అనర్హం అన్నట్టు లక్డౌన్ అయిపోయిన తర్వాత షూటింగ్ మొదలుపెట్టడాన్ని కూడా ఒక వీడియో రూపం లో తయారు చేసి ప్రొమోషన్ చేసుకుంటున్నారు సినిమా మేకర్స్. ఈ మధ్యనే RRR షూటింగ్ మొదలుపెట్టినప్పుడు రాజమౌళి ఒక వీడియో విడుదల చేసాడు. అదే బాటలో ఇపుడు రవితేజ, గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న ‘క్రాక్’ సినిమాకి సంబందించిన ఒక మేకింగ్ వీడియో కూడా విడుదల చేసారు మేకర్స్.ఈ హీరో డైరెక్టర్ కాంబినేషన్ లో ‘డాన్ శీను’, ‘బలుపు’ సినిమాలు వచ్చాయి. వీళ్లిద్దరి కాంబినేషన్ లో మూడవ సినిమాగా ‘క్రాక్’ వస్తుంది. ఈ సినిమా ఓటీటీ లో విడుదలవుతుంది అని చాలా రూమర్స్ వచ్చిన కూడా మేకర్స్ ఆ వార్తల్ని ఖండించారు.
ఈ సినిమా షూటింగ్ పోయిన వారమే మొదలైంది. విడుదల చేసిన మేకింగ్ వీడియో లో సెట్ మొత్తాన్ని శానిటైజ్ చెయ్యడం, మాస్కు లు ధరించడం, డిసైన్ఫెక్టన్ట్ టన్నెల్ లాంటి కోవిడ్ జాగ్రత్తల్ని చూపిస్తూ చివర్లో రవితేజ చెప్పే ఒక డైలాగ్ కూడా విడుదల చేసారు. ‘స్టేషన్‌లో ఉన్నప్పుడు ఫోన్ సైలెంట్ మోడ్‌లో పెట్టి దొబ్బిచ్చుకో’ అనే రవితేజ డైలాగ్ తో వీడియో ముగించారు. ఈ సినిమాలో రవితేజ కి జోడి గా ‘శృతి హాసన్’ నటించింది. ఒక ఫామిలీ ఎమోషన్ ఉండే ఇంటెన్స్ కాప్ స్టోరీ గా ఈ మూవీ రాబోతుంది.