fbpx
Sunday, January 19, 2025
HomeMovie Newsక్రాక్ ట్రైలర్ : మరోసారి పవర్ఫుల్ పోలీస్ రోల్ లో మాస్ రాజా

క్రాక్ ట్రైలర్ : మరోసారి పవర్ఫుల్ పోలీస్ రోల్ లో మాస్ రాజా

Raviteja KrackMovie TrailerReleased

టాలీవుడ్: రవితేజ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘క్రాక్’. ‘డాన్ శీను’, ‘బలుపు’ సినిమాలతో రవితేజ కి సక్సెస్ అని అందించిన డైరెక్టర్ గోపిచంద్ మలినేని. వీళ్లిద్దరి కాంబినేషన్ లో మూడవ సినిమాగా ఈ సినిమా రూపొందింది. ఒంగోలు బ్యాక్ డ్రాప్ లో జరిగే వరుస హత్యల ఉదంతం పైన ఈ సినిమా రూపొందించబడింది. ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ ఇవాల విడుదలైంది. ట్రైలర్ ఆద్యంతం పవర్ఫుల్ ఇంటెన్సిటీ తో కూడుకున్న యాక్టింగ్ మరియు డైలాగ్స్ తో రవి తేజ ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో రవితేజ కి జోడీగా శృతి హాసన్ నటించింది. విక్టరీ వెంకటేష్ అందించిన వాయిస్ ఓవర్ తో ఈ సినిమా ట్రైలర్ ప్రారంభం అయింది. ట్రైలర్ ఆరంభం లో రవితేజ వెళ్లిన చోట ఉన్న విలన్స్ ని ఎలా ఒకేసారి మట్టుపెట్టాడు అని ఒక డైలాగ్ ద్వారా తెలిపారు.

ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ మరోసారి పవర్ఫుల్ విలన్ రోల్ లో నటిస్తున్నారు. తమిళ నటుడు సముద్రఖని, రవిశంకర్ కూడా మరో రెండు విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి థమన్ అందించిన సంగీతం పరవాలేదనిపించింది. సాయి మాధవ్ బుర్ర ఈ సినిమాకి అందించిన మాటలు బాగున్నాయి. కొత్త సంవత్సరం సందర్భంగా ఈ రోజు ట్రైలర్ ని విడుదల చేసి ప్రమోషన్స్ మొదలు పెట్టిన క్రాక్ సినిమా టీం సంక్రాతి సందర్భంగా జనవరి 14 న విడుదల అవబోతుంది. సినిమా ట్రైలర్ ప్రకారం విక్రమార్కుడు, పవర్ తర్వాత రవి తేజ మరోసారి అంతటి పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తున్నట్టు తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular