మాస్ మహారాజా రవితేజ వరుసగా కొత్త సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు. మాస్ జాతర షూటింగ్ పూర్తవుతుండగా, మరో రెండు కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
తాజా సమాచారం ప్రకారం, నేను శైలజా, చిత్రలహరి ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ ఓ ఎమోషనల్ డ్రామాకు అంగీకరించినట్లు టాక్. ఈ కథ మాస్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుందని, అందుకే రవితేజ వెంటనే ఓకే చెప్పాడని తెలుస్తోంది.
ఇక మ్యాడ్ సినిమాతో హిట్ కొట్టిన కళ్యాణ్ శంకర్ కూడా రవితేజకు ఓ మాస్ ఎంటర్టైనర్ కథ చెప్పాడట. అయితే మొదట కిషోర్ తిరుమల సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.
వరుసగా రెండు ఫ్లాపులు ఎదురైనా, రవితేజ జోరు తగ్గడం లేదు. ధమాకా లాంటి హిట్ తర్వాత మళ్లీ అదే స్థాయి సినిమాలు చేయాలని ఆయన ప్లాన్ చేస్తున్నాడు. ఈ రెండు ప్రాజెక్టులు ఎప్పుడు అనౌన్స్ అవుతాయో చూడాలి.