టోక్యో: టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ 2021లో ఒక అరుదైన విషయం చోటుచేసుకుంది. మాజీ వెస్టిండీస్ క్రికెటర్ అయిన విన్‌స్టన్ బెంజమిన్ కుమారుడు రాయ్ బెంజమిన్ టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్‌లో పతకం సాధించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా ఇవాళ జరిగిన 400 మీటర్ల హర్డిల్స్ ఫైనల్స్‌లో రాయ్ బెంజమిన్ 46.17 సెకండ్లలో గమ్యాన్ని చేరుకొని రజత పతకం సాధించాడు.
ఇప్పటివరకు ఒలింపిక్స్ చరిత్రలో ఉన్న 400 మీటర్ల హార్డిల్స్‌ను అత్యంత వేగంగా పూర్తి చేసిన రెండవ ఆటగాడిగా రాయ్ బెంజమిన్ చరిత్ర సృష్టించాడు. కాగా ఈ పతకం గెలుపుతో బెంజమిన్ ఒలింపిక్స్‌లో హాట్‌టాపిక్‌గా అయ్యాడు. రాయ్ బెంజమిన్ తండ్రి విన్‌స్టన్ బెంజమిన్ ఒక మాజీ క్రికెటర్ తన తొమ్మిదేళ్ల కెరీర్‌లో విండీస్ తరపున 21 టెస్టులు, 85 వన్డేలు ఆడారు.
కాగా ఇక ఇదే హార్డిల్స్‌లో బంగారు పతకం అందుకున్న నార్వే అథ్లెట్ కార్‌స్టెన్ వార్లోమ్ ఈ విషయంలో ప్రపంచరికార్డు సృష్టించాడు. 400 మీ హార్డిల్స్‌ను కేవలం 45.94 సెకన్లలో చేరుకొని చరిత్ర సృష్టించాడు. బ్రెజిల్‌కు చెందిన అలిసన్ దాస్ సాంటోస్ 46.72 సెకండ్లలో కాంస్య పతకం సాధించాడు. అలాగే ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ స్టార్క్ సోదరుడు బ్రెండన్ స్టార్క్ మెన్స్ హై జంప్ విభాగంలో ఫైనల్‌కు చేరుకున్నా ఆరో స్థానంలో నిలిచాడు.