fbpx
Wednesday, December 25, 2024
HomeBusinessఆర్‌బీఐ నాలుగు బ్యాంకులపై జరిమానా విధింపు

ఆర్‌బీఐ నాలుగు బ్యాంకులపై జరిమానా విధింపు

RBI-FINES-FOUR-BANKS-FOR-VIOLATING-RULES

ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన కొన్ని ఆదేశాలను బేఖాతరు చేసినందుకు నాలుగు బ్యాంకులకు జరిమానా విధించింది. సిటీ యూనియన్ బ్యాంక్, తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్, మరో రెండు ఇతర బ్యాంకులపై ఆర్‌బీఐ ఇవాళ భారీ జరిమానా విధించింది. పై తెలిపిన బ్యాంకులు వ్యవసాయ రుణాలపై, ఎడ్యుకేషన్ లోన్స్, ఎంఎస్ఎంఈ రుణాల విషయంలో ఆర్‌బీఐ నిబంధనలను పాటించనందుకు సిటీ యూనియన్ బ్యాంక్ లిమిటెడ్‌కు రూ.1 కోటి జరిమానా విధించింది.

దీనితో పాటు సైబర్ సెక్యూరిటీ విషయంలో నిబందనలు పాటించని కారణంగా తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ కు ఆర్బీఐ రూ.1 కోటి జరిమానా విధించింది. రిజర్వ్ బ్యాంక్ ఈ రెండు బ్యాంకులతో పాటూ మరో రెండు బ్యాంకులపై కూడా జరిమానా విధించింది. కస్టమర్ల డిపాజిట్లపై వడ్డీ రేట్లు, కేవైసీ నియమాలను నూతన్ నాగరిక్ సహకారి బ్యాంక్‌ మీరినందుకు ఆ బ్యాంకుకు రూ.90 లక్షల జరిమానా పడింది.

రిజర్వ్ బ్యాంక్ కమర్షియల్ పేపర్ డైరెక్షన్స్ 2017, ‘నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్’లో ఉన్న కొన్ని నిబంధనలను పాటించనందుకు పూణేలోని మరొక బ్యాంక్ అయిన డైమ్లెర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పై అపెక్స్ బ్యాంక్ పై రూ.10 లక్షల జరిమానా వేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular