టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC 16 మూవీపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. లేటెస్ట్ గా సినిమాటోగ్రాఫర్ రత్నవేలు క్రికెట్ పవర్ అంటూ ఇచ్చిన హింట్ అభిమానుల్లో ఉత్సాహం పెంచింది.
ప్రస్తుతం మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గేమ్ చేంజర్ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన తర్వాత, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. అదే సమయంలో రిలీజ్ డేట్‌పై కూడా క్లారిటీ వస్తోంది. తాజా సమాచారం ప్రకారం, RC 16 మూవీని 2025 అక్టోబర్ 16న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
దీపావళి (అక్టోబర్ 20) వారం కాబట్టి, ఈ డేట్ వసూళ్ల పరంగా సరిగ్గా సెట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం.
సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, జగపతి బాబు, శివరాజ్ కుమార్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తుండగా, వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి.