స్పోర్ట్స్ డెస్క్: RR vs RCB: ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఎట్టకేలకు తమ సొంత మైదానంలో విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్‌పై ఉత్కంఠ భరిత పోరులో బెంగళూరు 11 పరుగుల తేడాతో గెలిచింది.
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (70), దేవ్‌దత్ పడిక్కల్ (50) అర్ధశతకాలతో రాణించారు.
పవర్ ప్లేలో బెంగళూరు 59 పరుగులు చేసింది. సాల్ట్ (26) ఔట్ అయిన తర్వాత పడిక్కల్‌తో కలిసి కోహ్లీ జోడీ నిలిపాడు. ఇద్దరూ అర్థ శతకాలు సాధించారు. జితేశ్ శర్మ (20*), టిమ్ డేవిడ్ (23) చివర్లో పరుగులు రాబట్టడంతో స్కోరు 205 పరుగులకు చేరింది. రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ 2 వికెట్లు తీసాడు.
లక్ష్య ఛేదనలో రాజస్థాన్‌కి యశస్వీ జైస్వాల్ (49), ధ్రువ్ జురెల్ (47) ధీటుగా పోరాడారు. కానీ చివరి ఓవర్లలో హేజిల్‌వుడ్ (4/28) అద్భుత బౌలింగ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. 19వ ఓవర్లో కేవలం 1 పరుగే ఇవ్వగా, యశ్ దయాల్ 20వ ఓవర్లో 17 పరుగుల లక్ష్యాన్ని కాపాడాడు.
రాజస్థాన్ మొత్తం 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 194 పరుగులు మాత్రమే చేసింది. బెంగళూరు బౌలర్లలో హేజిల్‌వుడ్ 4, కృనాల్ పాండ్య 2, భువనేశ్వర్, యశ్ తలో వికెట్ తీశారు. ఈ విజయంతో బెంగళూరు మళ్లీ పాయింట్ల పట్టికలో పోటీకి వచ్చింది. కోహ్లీకి ఇది ఐపీఎల్ 2025లో 5వ అర్థ శతకం కావడం విశేషం.